ప్రపంచాన్ని వణికిస్తున్న ‘ఒమిక్రాన్‌’.. ఇంతకూ ఆ పేరే ఎందుకు? | How WHO Names Omicron Variant It Avoids Greek Alphabet XI | Sakshi
Sakshi News home page

Omicron Variant: ప్రపంచాన్ని వణికిస్తున్న ‘ఒమిక్రాన్‌’.. ఇంతకూ ఆ పేరే ఎందుకు?

Published Sun, Nov 28 2021 9:22 AM | Last Updated on Sun, Nov 28 2021 10:56 AM

How WHO Names Omicron Variant It Avoids Greek Alphabet XI - Sakshi

జెనీవా: కరోనా వైరస్‌లో కొత్త రకాలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీకు వర్ణమాలలోని అక్షరాల పేర్లనే పెడుతూ వస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా అంటూ వరసగా పేర్లు పెట్టుకుంటూ వస్తున్న డబ్ల్యూహెచ్‌ఓ హఠాత్తుగా కొన్ని అక్షరాలను వదిలేసి ఒమిక్రాన్‌ని ఎంపిక చేసుకుంది. వాస్తవానికి లాంబ్డా తర్వాత ‘‘న్యూ’’ అక్షరం రావాలి. ఆ తర్వాత గ్రీకు వర్ణమాల ప్రకారం ‘‘గీఐ’ వస్తుంది.  

న్యూ అంటే ఆంగ్లంలో కొత్త అనే అర్థం ఉంది కాబట్టి గందరగోళానికి తావు లేకుండా దానిని విడిచిపెడితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేరులో ‘XI’ (షి జిన్‌పింగ్‌) ఉండడంతో దానిని కూడా డబ్ల్యూహెచ్‌ఓ విడిచిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వీటిని వదిలేసి గ్రీకు వర్ణమాలలోని పదిహేనో అక్షరమైన ‘ఒమిక్రాన్‌’గా కొత్త వేరియెంట్‌కు నామకరణం చేసింది.
(చదవండి: ఎవడి డప్పు వాడు కొట్టుకున్నా..వందల కోట్లు కట్టాల్సిందే…!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement