USA: నాడు ఈ ముగ్గురు నేతలపైనా కాల్పులు | Firing On US Politicians During Rally: Here's A Look At Past Attacks Against US Presidents And Candidates | Sakshi
Sakshi News home page

USA: నాడు ఈ ముగ్గురు నేతలపైనా కాల్పులు

Published Sun, Jul 14 2024 10:02 AM | Last Updated on Sun, Jul 14 2024 11:33 AM

Firing on US Politicians During Rally

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో  ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్రంప్‌ కుడి చెవికి గాయమయ్యింది. గతంలోనూ అమెరికాకు చెందిన ముగ్గురు ప్రముఖ రాజకీయ నేతలపై వివిధ సమయాల్లో కాల్పులు జరిగాయి.

జార్జ్ వాలెస్
అలబామా గవర్నర్ జార్జ్ వాలెస్‌పై 1972, ​మే 15 కాల్పులు జరిగాయి. ఆర్థర్ బ్రెమెర్ అనే 21 ఏళ్ల కుర్రాడు నాటి అధ్యక్ష అభ్యర్థి, అలబామా గవర్నర్ జార్జ్ వాలెస్‌పై కాల్పులు జరిపాడు. మేరీల్యాండ్ షాపింగ్ సెంటర్‌లో జార్జ్ వాలెస్‌ ప్రచారం చేస్తుండగా, అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో వాలెస్ ప్రాణాలతో బయటపడినప్పటికీ,  జీవితాంతం పక్షవాతంతో బాధపడ్డారు.

రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ
1968, మార్చి 16న రాబర్ట్ కెన్నెడీ డెమోక్రటిక్ అమెరికా అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆయన తన ఉత్సాహపూరిత ప్రచారంతో ప్రజలను అమితంగా ఆకట్టకున్నారు. దీంతో ఆయనపై అమెరికన్ ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే 1968 జూన్‌ 5న కాలిఫోర్నియాలోని అంబాసిడర్ హోటల్‌లో రాబర్ట్ ఎఫ్ కెన్నెడీపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయన మృతి చెందారు.

రోనాల్డ్ రీగన్ 
1981, మార్చి 30న నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రీగన్‌ గాయపడ్డారు. వాషింగ్టన్ హిల్టన్‌లో బస చేసిన తర్వాత రీగన్‌ తన లిమోసిన్‌ ‍ప్రాంతానికి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement