Dozens Trapped In World's Highest Ecuador Cable Cars Rescued - Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే ఎత్తైన కేబుల్ కార్.. గాల్లో ఆగిపోయింది.. 

Published Sat, Jul 8 2023 6:42 PM | Last Updated on Sat, Jul 8 2023 6:56 PM

Dozens Trapped In Worlds Highest Ecuador Cable Cars Rescued - Sakshi

ఈక్వెడార్: ప్రపంచంలోనే ఎత్తైన ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 75 మంది గంటల తరబడి అందులో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు గంటల పాటు శ్రమించి అందులో ప్రయాణిస్తున్న మొత్తం 75 మందిని సురక్షితంగా కిందికి చేర్చగలిగారు. 

గాల్లో కేబుల్ కార్ ప్రయాణమంటే సాహసం చేస్తున్నామన్న భావం తోపాటు వినోదం కూడా గ్యారెంటీ. మరి అలాంటి కేబుల్ కార్ లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రమాదం జరిగితే వినోదం కాస్తా విషాదంగా మారిపోతుంది. ఈక్వెడార్ కేబుల్ కార్ లో అచ్చంగా అలాంటి పరిస్థితే నెలకొంది. 

ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఇది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల నుండి నాలుగు వేల మీటర్ల ఎత్తులో రెండు టెర్మినల్స్ మధ్యలో ప్రయాణిస్తుంది. శుక్రవారం 75 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఈ కేబుల్ కార్ లో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక అందులోని వారు అలాగే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. 

సుమారు పది గంటల నిరీక్షణ తర్వాత సహాయక బృందాలు గాల్లో కార్ ఆగిన చోటికి చేరుకొని 65 మందిని తాడుల సాయంతో క్షేమంగా కిందికి దించారు. మరో పది మంది మాత్రం కేబుల్ కార్ తిరిగి ప్రారంభమైన తర్వాత సురక్షితంగా కిందికి వచ్చారు. వీడియోలో ప్రయాణికులను రక్షిస్తున్న దృశ్యాలను చూడవచ్చు. 

ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement