జనాల మీదకు యుద్ధ ట్యాంకర్లు.. మళ్లీ మారణహోమం?! China deploys tanks to prevent people from withdrawing money | Sakshi
Sakshi News home page

యుద్ధ ట్యాంకర్లతో జనాలను భయపెడుతూ.. మళ్లీ మారణహోమం తప్పదా?!

Published Thu, Jul 21 2022 1:49 PM | Last Updated on Thu, Jul 21 2022 1:58 PM

China deploys tanks to prevent people from withdrawing money - Sakshi

బీజింగ్‌: చైనాలో వరుస సంక్షోభాలు అక్కడి ప్రజలను అరిగోస పెడుతున్నాయి. తాజాగా కొన్ని బ్యాంకులు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంతో.. ఖాతాదారులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోనుపోనూ ఈ నిరసనలు పెను ఉద్యమంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రజలను నిలువరించేందుకు యద్ధ ట్యాంకర్లను రంగంలోకి దించించి జింగ్‌పిన్‌ సర్కార్. 

కొన్ని బ్యాంకులు ఏప్రిల్‌ నుంచి తమ ఖాతాదారులు నగదును విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుకుంటున్నాయి.హెనన్‌ ప్రావిన్స్‌లో గ్రామీణ, పట్టణ బ్యాంకులు కారణాలు చెప్పకుండా ఖాతాదారులకు షాకులు ఇస్తున్నాయి. ఈ బ్యాంకుల స్కామ్‌కు ప్రభుత్వం నుంచి అండ లభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నివారాలుగా బ్యాంక్‌ ఖాతాదారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదాలుచోటు చేసుకుంటున్నాయి.

బ్యాంకుల మీద దాడులు జరుగుతాయనే ఉద్దేశం, బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవద్దనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో.. చైనీస్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ యుద్ధ ట్యాంకర్లను బ్యాంకుల వద్ద మోహరిస్తోంది. నిరసనకారులు దాడులకు పాల్పడకుండా భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే నిరసనకారులు మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. నిధుల నిలిపివేతను ఉపసంహరించుకుని.. తమ డబ్బుల్ని ఇచ్చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. 

చరిత్ర పునరావృతం అయ్యేనా.. 
తాజా వీడియోలతో అక్కడి జనాల వెన్నులో వణుకుపుడుతోంది. అందుకు కారణం.. టియానన్‌మెన్‌ స్క్వేర్‌ మారణహోమం గుర్తుకు రావడం. ప్రజాస్వామ్య పద్దతులు కావాలని, స్వేచ్ఛను కోరుతూ వేల మంది విద్యార్థులు బీజింగ్‌లోని టియానన్‌మెన్‌ స్క్వేర్‌ వద్ద నిరసనలు కొనసాగించారు. వాళ్లను అక్కడి నుంచి క్లియర్‌ చేయడానికి భారీగా ఆర్మీని రంగంలోకి దించింది ప్రభుత్వం. సుమారు నెలపాటు జరిగిన మారణ హోమంలో వందల మంది(వేల మంది అని చెప్తుంటారు) మరణించారు. వాళ్లకు స్మారకంగా.. అక్కడొక స్థూపాన్ని సైతం నిర్మించేందుకు అనుమతించలేదు. దీంతో హాంకాంగ్‌లో ఓ యూనివర్సిటీ బయట ఏర్పాటు చేశారు. అయితే.. ఆ స్మారకాన్ని సైతం బలవంతంగా తొలగించింది చైనా.   

అన్నట్లు మొన్న జూన్‌ 4వ తేదీకి టియానన్‌ మారణహోమానికి 33 ఏళ్లు నిండాయి. ఆ ఘటనలో.. యుద్ధ ట్యాంకర్ల ఎదురుగా ఓ వ్యక్తి ధైర్యంగా నిల్చున్న ఫొటో ఒకటి చరిత్రకెక్కింది కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement