ప్రీత్‌ చాందీ ఒంటరి సాహసం..! | British Sikh Woman Makes History With Solo Trip To South Pole | Sakshi
Sakshi News home page

40 రోజుల్లో 700 మైళ్లు.. ప్రీత్‌ చాందీ ఒంటరి సాహసం..!

Published Tue, Jan 4 2022 1:11 PM | Last Updated on Tue, Jan 4 2022 1:40 PM

British Sikh Woman Makes History With Solo Trip To South Pole - Sakshi

British Sikh Woman Makes History With Solo Trip To South Pole: బ్రిటీష్‌లో జన్మించిన సిక్కు ఆర్మీ అధికారి ప్రీత్ చాందీ ఒంటరిగా దక్షిణ ధృవ సాహా యాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ మేరకు చాందీ సాహసయాత్ర గతేడాది నవంబర్‌లో ప్రారంభమైంది. పైగా ఆమె అంటార్కిటికా అంతర్గత అధికారుల సహాయ సహకారాలు తీసుకోకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

(చదవండి: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!)

అయితే  ఆమె  జనవరి 3న 700 మైళ్ల దూరాన్ని 40 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రీత్‌ చాందీ మాట్లాడుతూ..." భూమిపై అత్యంత, ఎత్తైన, శీతలమైన పొడి గాలులతో కూడిన ఖండం అంటార్కిటికా. అక్కడ ఎవరూ శాశ్వతంగా నివశించరు. నేను మొదట ప్లాన్ చేయడం ప్రారంభించినప్పుడు ఖండం గురించి నాకు పెద్దగా తెలియదు. అదే నన్ను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించింది.

అంతేకాదు దక్షిణ ధృవ సాహసయాత్ర కోసం రెండున్నర సంవత్సరాలు నుంచి సిద్ధమయ్యాను. ఇందులో భాగంగా క్రేవాస్‌లో శిక్షణ తీసుకున్నా. చివరకు నేను మంచు కురుస్తున్న దక్షిణ ధృవానికి చేరుకున్నా" అని బావోధ్వేగంగా తెలిపింది. అంతేకాదు "పోలార్‌ ప్రీతీ" క్యాప్షన్‌ని జోడించి మరీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సాహాసయాత్రకు సంబంధించిన ఫోటోలను పోస్ట్‌ చేసింది. ఈ మేరకు బ్రిటీష్‌ సైన్యం  ప్రీత్ చాందీనిl అబినందించడమే కాక ధృఢమైన సంకల్పానికి స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రశంసించారు.

(చదవండి: ఈ కేసును మేము వాదించం: న్యాయవాదులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement