America Should Not Play With Fire Regarding Taiwan, China Threatened US - Sakshi
Sakshi News home page

తైవాన్‌పై జోక్యం నిప్పుతో చెలగాటమా? అమెరికాను చైనా ఎందుకు హెచ్చరించింది?

Published Sat, Aug 19 2023 12:49 PM | Last Updated on Sat, Aug 19 2023 1:14 PM

America Should not Play with Fire Regarding Taiwan China Threatened - Sakshi

తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లై ఇటీవలే చైనాలో పర్యటించారు. నాటి నుంచి అమెరికాపై చైనా విరుచుకుపడుతూ వస్తోంది. చైనా రక్షణ మంత్రి ఆమధ్య రష్యా, బెలారస్ పర్యటనకు వెళ్లినప్పుడు అతనికి అమెరికా ప్రతినిధులతో మాట్లాడే అవకాశం లభించింది. తైవాన్ విషయంలో కల్పించుకుని అమెరికా నిప్పుతో చెలగాటం ఆడుతోందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికాను హెచ్చరించింది. తైవాన్‌పై ఉక్కుపాదం మోపడం ద్వారా చైనాను అదుపులో ఉంచుకోవాలన్న అమెరికా ప్రయత్నం ఫలించదని చైనా రక్షణ మంత్రి పేర్కొన్నారు.

‘బాహ్య జోక్యాన్ని చైనా సహించదు’
అంతర్జాతీయ భద్రతపై మాస్కో కాన్ఫరెన్స్‌లో చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు మాట్లాడుతూ తైవాన్‌ను అడ్డుపెట్టుకుని చైనాను నియంత్రించే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది. చైనా ప్రధాన భూభాగంతో తైవాన్ పునరేకీకరణ అనివార్యమని, దానిని ఎవరూ నివారించలేరని లీ షాంగ్‌ఫు అన్నారు. తైవాన్ అంశం చైనా అంతర్గత వ్యవహారమని, అందులో ఎలాంటి బాహ్య జోక్యాన్ని సహించేది లేదని చైనా రక్షణ మంత్రి హెచ్చరించారు.

చైనాకు వంత పాడిన పుతిన్‌
చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు చేసిన ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధ వాతావరణం మధ్యలో మాస్కోలో చైనా రక్షణ మంత్రి చేసిన ఈ ప్రకటన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ అంశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చైనాకు మద్దతుగా నిలిచారు. అమెరికా ప్రపంచ వివాదాలను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేస్తున్నదని పుతిన్ ఆరోపించారు.

ఉద్రిక్తతను పెంచిన విలియం లై పర్యటన
తైవాన్‌ విషయంలో ఇప్పటికే అమెరికాపై చైనా ఆగ్రహంతో ఉంది. తైవాన్‌ ఉపాధ్యక్షుడు విలియం లై తైవాన్  పర్యటన ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. విలియం లై త్వరలో జరగబోయే తైవాన్‌ అధ్యక్ష ఎన్నికలలో ప్రధాన అభ్యర్థి కానున్నారు. కాగా విలియం లై ఇటీవలే పరాగ్వేను సందర్శించారు. పరాగ్వేకు వెళ్లే మార్గంలో ఆయన అమెరికాలో ఆగారు. ఫలితంగా విలియం లైపై చైనా గన్ను ఎక్కుపెట్టింది. విలియం లై  పదేపదే ఇబ్బందులను సృష్టిస్తున్నాడని చైనా ఆరోపించింది. 

వన్ చైనా పాలసీ అంటే ఏమిటి?
తైవాన్‌ను చైనా ఎప్పుడూ ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. తన దేశంలో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతంగానే పరిగణిస్తూ వస్తోంది. ఇది తైవాన్‌ను తమ దేశంలోని ఒక రాష్ట్రంగా భావిస్తుంది. ‘వన్ చైనా పాలసీ’ని గుర్తించాలని ప్రపంచానికి చెబుతుందటుంది. తైవాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగించాలనుకునే దేశాలు రిపబ్లిక్ ఆఫ్ చైనాతో సంబంధాలను తెంచుకోవాల్సి వస్తుందని చైనా హెచరించింది. వన్ చైనా పాలసీ ప్రకారం తైవాన్ ప్రత్యేక దేశం కాదు. ఇది చైనాలో భాగం. తైవాన్ కూడా హాంకాంగ్, మకావు మాదరిగా చైనా దేశ అధికార పరిధిలోకి వస్తుందని చైనా నమ్ముతుంది. అయితే  చైనా భావనలోని ఈ విధానాన్ని తైవాన్ అంగీకరించదు. తమది స్వతంత్ర దేశమని ప్రకటించుకుంది.

చైనా- అమెరికా మధ్య ఉద్రిక్తతలు
ఇటీవలి కాలంలో తైవాన్ విషయంలో చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. నిజానికి తైవాన్‌ విషయంలో చైనా ‘వన్ చైనా పాలసీ’ని అనుసరిస్తుంది. ప్రపంచ దేశాలు ఈ విధానాన్ని గుర్తించాలని కోరుతుంటుంది. అయితే అమెరికా దీనిని సమర్థించడం లేదు. గతేడాది అమెరికా ప్రతినిధి తైవాన్‌ను సందర్శించారు. అప్పుడు చైనా.. అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం చైనా.. తైవాన్ సమీపంలో సైనిక కార్యకలాపాలను పెంచింది. తాజాగా తైవాన్ ఉపాధ్యక్షుడి అమెరికా పర్యటనపై చైనా మరోసారి  మండిపడింది. ఇదిలా ఉండగా చైనా రక్షణ మంత్రి రష్యా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు తైవాన్‌పై అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించాయి.
ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్‌ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement