ఎమర్జెన్సీ చీకటికి 46 ఏళ్లు | Former MLA Mandadis Article On Emergency | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ చీకటికి 46 ఏళ్లు

Published Fri, Jun 25 2021 8:07 AM | Last Updated on Fri, Jun 25 2021 8:27 AM

Former MLA Mandadis Article On Emergency - Sakshi

దేశ ప్రజలు నిద్రిస్తున్న వేళ 1975 జూన్‌ 25 నాడు∙లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారా యణ్, మొరార్జీ దేశాయ్, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ లాంటి అగ్రశ్రేణి నాయకులను రాత్రికి రాత్రే జైళ్లలో నిర్బంధించారు. ఆరెస్సెస్‌పై నిషేధం విధించి, వారి కార్యాలయాలను సీజ్‌ చేశారు. వార్తా పత్రికల కార్యాలయాలకు కరెంట్‌ కోత విధించి, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా సెన్సార్‌ కత్తిని ఎత్తి బెది రించారు. ప్రజలకు ఏం జరుగుతున్నదో అర్థమయ్యే లోపే మొత్తం దేశాన్ని బందీఖానాగా మార్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం.

1973లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇందిరా గాంధీ అక్రమాలకు, అవినీతి చర్యలకు పాల్పడినట్లు రుజువైనందున ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పిచ్చింది. అదేరోజు వెలువడిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్‌ పార్టీ చిత్తుగా ఓడినట్టు తేలింది. ఆరోజే ఇందిరకు అత్యంత సన్ని హితుడు డి.పి. ధార్‌ గుండె నొప్పితో చనిపోయాడు.  పిడుగుపాటు లాంటి ఈ మూడు వార్తలు ఒక వైపు, అధికారాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి మరోవైపు రావడంతో ఆమెలోని వికృత రూపం జడలు విప్పింది.

అంతకుముందే కాంగ్రెస్‌ ప్రభుత్వాల అక్రమా లకు వ్యతిరేకంగా జయప్రకాష్‌ నారాయణ్‌ ఆధ్వ ర్యంలో ప్రారంభమైన నవ నిర్మాణ్‌ సంఘర్ష సమితి ఉద్యమంలో నాటి జనసంఘ్‌ నాయకులు, విద్యా ర్థులు పాల్గొని దాన్ని బిహార్‌ నుండి గుజరాత్‌ వరకు విస్తరింపజేశారు.  వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ప్రజలను ప్రేరేపిస్తున్నారని దుష్ప్రచారం చేసి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కీలుబొమ్మ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ గుడ్డిగా సంతకం చేశారు. కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సిగ్గు లేకుండా ఎమర్జెన్సీని సమర్థించింది. విప్లవ కవి త్వంలో అగ్రగణ్యుడైన శ్రీశ్రీ ఇందిరమ్మ నియంతృ త్వాన్ని స్వాగతించారు. తర్వాతి కాలంలో తప్పు చేశామని చెంపలేసుకున్నారు, అది మరో కథ.

18 నెలల పాటు నిరంకుశత్వం స్వైరవిహారం చేసింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ దమనకాండను ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదని సుప్రీం కోర్టులో వాదించారు. ఆనాటి అమానుషమైన స్థితికి ఒక ఉదాహరణ కేరళ విద్యార్థి నాయకుడు రాజన్‌ను పోలీసులే అపహరించటం. ఆ అపహరణ కేసులో ప్రభుత్వం పక్షాన వాదించిన అటార్నీ జనరల్‌ ‘అపహ రించడమేకాదు, ఒక పౌరుణ్ని చంపినప్పటికీ ప్రశ్నించే అధికారం ఏ కోర్టుకు కూడా లే’దని వాదించాడంటే ఆనాటి కిరాతక స్థితి ఎలా ఉందో ఊహించొచ్చు.

నియంతృత్వానికి వ్యతిరేకంగా బహిరంగ ఉద్య మాలకు, సత్యాగ్రహాలకు రూపకల్పన జరిగింది.   తమకు ఎదురేలేదని విర్రవీగుతున్న నియంతకు హఠా త్పరిణామంతో దిమ్మ తిరిగింది. ఎక్కడికక్కడ అరె స్టులకు పూనుకుంది. స్కూళ్లు, కాలేజీ భవనాలను జైళ్లుగా మార్చవలసి వచ్చింది. ఎన్నికలకు ఇదే అదను అని ఆంతరంగికులు సలహా ఇచ్చారు. ప్రజలు బ్రహ్మ రథం పడతారని ఇంటెలిజెన్స్‌ నివేదికలు చెప్పాయి. ఎన్నికలు జరిపిస్తే అంతర్జాతీయంగా వచ్చిన చెడ్డపేరు పోయి ప్రజాస్వామ్యంలో నిబద్ధత కలిగిన నాయకురా లిగా మంచిపేరు వస్తుందని ఊహించారు. ప్రతిపక్షా లకు ఊపిరిపీల్చే సమయం ఇవ్వకుండా తక్షణమే ఎన్నికల ప్రకటన చేయించారు. నాయకులందరూ నిర్బంధంలో ఉన్నప్పటికీ ప్రజలు నిశ్శబ్దంగా కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపించారు. తల్లీ కొడుకులు ఇద్దరూ కూడా చిత్తుగా ఓడిపోయారు. జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్‌ ప్రధాన మంత్రిగా, వాజ్‌పేయి, అద్వానీ, జార్జ్‌ ఫెర్నాండెజ్, మధు దండావతే లాంటి హేమాహేమీలు మంత్రు లుగా జనతా ప్రభుత్వం ఏర్పడింది.

ప్రభుత్వ పునాదులను కదిలించగలిగిన స్థాయిలో సత్యాగ్రహోద్యమం నడిపించగలిగిందంటే ఆరెస్సెస్‌ నెట్‌వర్క్‌ ఎంత పటిష్టమైనదో ప్రజలకు తెలి సొచ్చింది. ఆనాడు పోరాటంలో పాల్గొన్న లక్షలాది మంది ప్రజాస్వామ్య పరిరక్షకులకు, ఇంతమందిని కదిలించిన ఆరెస్సెస్‌ కార్యదక్షతకు జోహార్లు అర్పిం చాలి. ఎమర్జెన్సీ నేర్పిన గుణపాఠాలను రానున్న తరాలకు భద్రంగా అందించాలి. అయితే ఇందిరా గాంధీకి కొమ్ముకాసిన కమ్యూనిస్టులే నేడు బీజేపీ రాజ్యంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవని గగ్గోలు పెడుతుండటం గమనార్హం.

వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే
మొబైల్‌ : 98663 26248

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement