ఎల్లో అలర్ట్‌: ఈ పనులు అస్సలు చేయకండి! Yellow Alert food and fruits with tips  that keep you cool Summer  | Sakshi
Sakshi News home page

ఎల్లో అలర్ట్‌: ఈ పనులు అస్సలు చేయకండి!

Published Sat, Apr 6 2024 11:00 AM | Last Updated on Sat, Apr 6 2024 12:51 PM

Yellow Alert food and fruits with tips  that keep you coolSummer  - Sakshi

వేసవి కాలం అన్నాక ఎండలు సాధారణమే కదా అని లైట్‌ తీసుకుంటున్నారా?  అయితే ఈ స్టోరీ మీ కోసమే. మండే  ఎండలు, తీవ్రమైన ఉష్ట్రోగ్రతలనుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. తెలంగాణాలో ఉష్ణోగ్రతలు 43°Cకి పెరగడంతో తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ విభాగం-హైదరాబాద్ (IMD-H) ఎల్లో అలర్ట్‌  జారీ చేసింది. రాష్ట్రంలో నేడు రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వేసవి తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసు​కోవడం ముఖ్యం. ఈ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం.

కనీస జాగ్రత్తలు
వాతావరణానికి తగ్గట్టుగానే సహజం మన బాడీకూడా రియాక్ట్‌ అవుతుంది. ఎండకు దాహం వేస్తుంది. చల్లదనాన్ని కోరుకుంటుంది.  కానీ వేసవిలో  దాహం వేయకపోయినా, వీలైనంత వరకు  నీరు తాగుతూ ఉండాలి. ఏ కాస్త  అనారోగ్యంగా అనిపించినా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS)ని  తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసంలో సహజ ఎలక్ట్రోలైట్‌లతో నిండి ఉంటాయి కనుక శరీరానికి తక్షణ  శక్తి వస్తుంది.  ప్రత్యేకించి  ఎండకు బాగా అలసి పోయినప్పుడు బాగా  పనిచేస్తుంది. అలాగే  ఉప్పు కలిపి నిమ్మరసం, మజ్జిగ/లస్సీ,  పండ్ల రసాలు తీసుకోవాలి. ఇంట్లోనే  తయారుచేసిన పానీయాలైతే ఇంకా మంచిది.

తొందరగా వంట
ముఖ్యంగా  ఈ వేసవికాలంలో వంట ఎంత తొందరగా పూర్తి చేసుకొని అంత తొందరగా బయటపడితే మంచిది.  లేదంటే ఆ వేడికి, ఉక్క బోతకు  చెప్పలేనంత నీరసం వస్తుంది.  దాదాపు 10 గంటలలోపు వంట ఇంటి నుంచి  బయపడాలి.

బాగా వెంటిలేషన్ ,చల్లని ప్రదేశాలలో ఉండండి. సాధ్యమైనంతవరకు ఎండకు బయటికి వెళ్లకుండా ఉండాలి. ముఖ్యంగా  పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు.  మరీ తప్పనిసరి అయితే తప్ప బయటికి రావద్దు.  ఒక వేళ​ వెళితే  ఉదయం 12 గంటల లోపు, సాయంత్రం 4   గంటల తరువాత  బైటి పనులకు సమయాన్ని కేటాయించుకోవాలి. 

ఎండలో బయటి వెళ్లి..తిరిగి వచ్చిన వెంటనే  హడావిడిగా నీళ్లు తాగవద్దు.. కాస్త నెమ్మదించి, మెల్లిగా నీటిని తాగండి. అలాగే మరీ చల్లని నీళ్లను కూడా తాగకూడదు.

ఆహారం
పుచ్చకాయ, తర్బూజ నారింజ, ద్రాక్ష, పైనాపిల్ లాంటి పండ్లతోపాటు, నీరు ఎక్కువగా ఉండే  అన్ని రకాల ఆకు కూరలు, దోసకాయ, బీరకాయ, సొరకాయ, గుమ్మడి, టమాటా లాంటి  కూరగాయలు  తీసుకోవాలి. వేపుళ్లు,  మసాలాల వాడకాన్ని కూడా తగ్గించాలి.  పగటిపూట కిటికీలు , కర్టెన్లను మూసి వేయాలి.  రాత్రికి చల్ల గాలికి తెరిచి పెట్టండి. దోమలు రాకుండా దోమలు తెరలు తప్పనిసరి.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు మర్చిపోకూడదు. సన్నని వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. ఎండనుంచి కాపాడుకునేలా తలను టవల్ , స్కార్ప్‌, టోపీ, చున్నీతో కప్పుకోవాలి.

ఈ పనులు మానుకోండి
♦ 
ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుండి 03:00 గంటల మధ్య ఎండలో బయటికి రావద్దు.
♦  ఎండ ఎక్కువ  ఉన్న సమయంలో బాగా ఎక్కువ కష్టపడవద్దు.  కాసేపు నీడ పట్టున ఉండి  విశ్రంతి తీసుకోండి.
♦  చెప్పులు, గొడుగు లేకుండా బయటకు వెళ్లవద్దు.
♦  ఆల్కహాల్, టీ, కాఫీ , కార్బోనేటేడ్ శీతల పానీయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. 
♦  ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, మాంసాహారాన్ని మితంగా వాడండి. నిల్వ ఉన్న ఆహారాన్ని అస్సలు తినకూడదు 
♦  పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దు. ఇలా చేయడం వేడికి  ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. 

అప్రమత్తత
విపరీతమైన తలనొప్పి, జ్వరం, నీరసం, వాంతులు, విరోచనలు, గందరగోళం,  మూర్చ, కోమా లాంటి సమస్యలను కనిపిస్తే వెంటనే సమయంలోని వైద్యులను సంప్రదించండి.

ఎవరు మరింత అప్రమత్తంగా ఉండాలి 
ఆరుబయట పనిచేసే వ్యక్తులు; గర్భిణీ స్త్రీలు; మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు; శారీరకంగా అనారోగ్యం ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు,వృద్ధులను కుటుంబ సభ్యులు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement