ప్రాన్స్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! అలా తింటే మాత్రం.. What Happens When You Consume Prawns Veins | Sakshi
Sakshi News home page

ప్రాన్స్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! అలా తింటే మాత్రం..

Published Wed, Apr 10 2024 4:59 PM | Last Updated on Wed, Apr 10 2024 5:16 PM

What Happens When You Consume Prawns Veins - Sakshi

ప్రాన్స్‌ అంటే ఇష్టపడని వారుండారు. సీ ఫుడ్స్‌ బలవర్థకమైనవి రొయ్యలే. అలాంటి రొయ్యలు ఏ కూరగాయలతో వేసి వండినా..వాటి రుచే వేరు. తలుచుకుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అంత టేస్టీ..టేస్టీ రొయ్యలను వండకునేటప్పుడు జాగ్రత్త! అంటున్నారు నిపుణులు. ఆరోగ్యానికి ఎంత మేలు చేసే ఈ రొయ్యలను గనుక అలా తింటే ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే అంటున్నారు వైద్యులు. 

రోయ్యలు రుచి పరంగానే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాటి రొయ్యలు సరిగా క్లీన్‌ చేసి తినకపోతే అలెర్జీలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేగాదు ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అదేలా అంటే..

 ఆ పార్ట్‌ని తొలగించకుంటే..
రొయ్యల వీపుపై ఉండే నల్లని రక్తనాళాలు తొలగించకపోతే తీవ్రమైన సమస్యలు రావచ్చు. వాటిని ఉన్నప్పుడు తినడం వల్ల మరణం కూడా సంభవించొచ్చు. అందుకే వాటిని వండుకునే ముందు చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.రొయ్యల మీద ఉండే నల్లటి రక్తనాళాలు తప్పనిసరిగా తొలగించాలి. ఇది వ్యర్థాలు, విషపదార్థాలను మోసే ఈ సముద్ర ఆహారాల పేగు మార్గం. ఈ సిరలను తొలగించకపోవడం లేదా పాక్షికంగా వాటిని తొలగించడం వలన తీవ్రమైన ఫుడ్ అలెర్జీ రావడమే కాదు, అదే సమయంలో ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే అలాంటి అలర్జీలు రాకుండా ఉండాలంటే ఈ రక్తనాళాలని తప్పకుండా తొలగించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నల్లని రక్తనాళాలు తొలగించకుండా తినడం వల్ల ఆహార అలర్జీకి దారి తీస్తుంది. అయితే అది తిన్న వెంటనే ఒక్కోసారి మీకు కనిపించకపోవచ్చు. అది పేగుల్లో వ్యర్థాలు, టాక్సిన్స్, రసాయనాలు రూపంలో ఉంటుంది. ఇవి మన జీర్ణవ్యవస్థ, పేగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిని తొలగించకుండా వండుకుని తినడం వల్ల సడెన్గా చర్మంపై దద్దుర్లు రావాడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, గొంతులో ఇబ్బంది తలెత్తవచ్చు. ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. అయితే ఇవి తినడం వల్ల ప్రాణాలకి హాని జరుగుతుందనే విషయం తేల్చడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు నిపుణులు.  అందువల్ల రొయ్యలు తినేటప్పుడు ఈ నల్లటి రక్తనాళాన్ని తొలగించటం వంటి జాగ్రత్తలు తీసుకుని తినడం మంచిదని చెబుతున్నారు. 

రొయ్యల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
బరువు నియంత్రణలో..
బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా త‌మ డైట్‌లో రొయ్య‌ల‌ను చేర్చుకోవాలి. ఎందుకంటే రొయ్య‌లు సులువుగా జీర్ణమ‌వ‌డంతో పాటు. శ‌రీరంలో అద‌న‌పు కొవ్వును క‌రిగించి బ‌రువు త‌గ్గేలా చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా రొయ్య‌ల‌తో ల‌భిస్తాయి. అందువల్ల వారానికి ఒక‌సారైన రొయ్య‌ల్ని తీసుకోవడం మంచిది. 

కేన్సర్‌కి చెక్‌..
వీటిలో సెలీనియం కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలను శరీరంలోకి చొరబడకుండా నివారిస్తుంది. ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ నియంత్రణకు రొయ్యలు మంచి ఆహారం.

పుష్కలంగా పోషకాలు
అలాగే దంతాలు, ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. రొయ్యలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు ఎముకలు, కండరాలు బలపడతాయి. 

చర్మ సౌందర్యానికి..
చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. రొయ్యల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. తద్వారా మతిమరుపుని త్వరగా రానివ్వదు. అంతేకాకుండా శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే శక్తి రొయ్యల్లో ఉంటుంది.

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇతడే..ఆరోగ్య రహస్యమిదే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement