What Are The Harmful Side Effects Of Drinking Soft Drinks? - Sakshi
Sakshi News home page

Cool Drinks: రెగ్యులర్‌గా కూల్‌డ్రింక్స్‌ తాగుతున్నారా? అయితే ఈ తిప్పలు తప్పవు

Published Tue, Jun 20 2023 4:06 PM | Last Updated on Thu, Aug 10 2023 6:46 PM

What Are The Harmful Side Effects Of Drinking Cool Drinks - Sakshi

ఎండవేడి ఇంకా తగ్గడం లేదు. వర్షాకాలం మొదలైనా ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో వేడి తట్టుకోలేక చాలామంది శీతల పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ కూల్‌డ్రింక్స్‌ను ఇష్టపడుతుంటారు. ఇంటికి అతిథులు వచ్చినా, ఏదైనా నాన్‌వెజ్‌ వంటలు తిన్నా పక్కన కూల్‌డ్రింక్స్‌ ఉండాల్సిందే అనేంతలా లాగిస్తుంటారు.

అయితే ఇలా కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతల పానీయాలు తీసుకోవడం వల్ల  శరీరంలో చక్కెర స్థాయి పెరగడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.

► కూల్‌డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల పేగు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు గుర్తించాక నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది.
►  కూల్‌డ్రింక్స్‌లో ఎక్కవ మొత్తంలో చక్కెర, ప్రిజర్వేటివ్స్‌ ఉంటాయి. దీనిల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. అందుకే వీటిని ఎక్కువగా తాగితే ఊబకాయం సమస్య తలెత్తుతుంది.
►  శీతల పానీయాల్లో ఉండే కృత్రిమ చక్కెర, సోడా వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పటికే గుండె, డయాబెటీస్‌తో బాధపడుతున్నట్లయితే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
►  మధుమేహం, గుండె జబ్బులకు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణం.
►  కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్పోరిక్‌ యాసిడ్‌ వల్ల శరీరంలో ఎముకలు బలహీనపడతాయి. అలాగే దంతాలపై ఉండే ఎనామిల్‌ పొర కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. 
కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీస్తుంది.

మొత్తానికి కూల్‌డ్రింక్స్‌ వల్ల శరీరానికి మంచి కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement