భూగర్భ డ్రిప్‌ ‘స్వర్‌’ రూపశిల్పికి జాతీయ పురస్కారం! | Underground Drip 'Swar' Architect National Award To K.S Gopal | Sakshi
Sakshi News home page

భూగర్భ డ్రిప్‌ ‘స్వర్‌’ రూపశిల్పికి జాతీయ పురస్కారం!

Published Fri, Mar 22 2024 10:54 AM | Last Updated on Fri, Mar 22 2024 12:40 PM

Underground Drip 'Swar' Architect National Award To K.S Gopal - Sakshi

సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్‌సర్న్స్‌ (సిఇసి) డైరెక్టర్‌ కే.ఎస్‌. గోపాల్‌

సాక్షి సాగుబడి, హైదరాబాద్‌: ఉద్యాన పంటల సాగులో నీటిని అతితక్కువగా వినియోగించే వినత్న భూగర్భ డ్రిప్‌ ‘స్వర్‌’ పద్ధతిని ఆవిష్కరించిన హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్‌సర్న్స్‌ (సిఇసి) డైరెక్టర్‌ కే.ఎస్‌. గోపాల్‌ ‘నీటి సుస్థిరత పురస్కారం 2023–24’ విజేతగా నిలిచారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం సాయంత్రం జరిగిన సభలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రధాన కార్యదర్శి, సీఈఓ భరత్‌ లాల్‌ చేతుల మీదుగా గోపాల్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

ద ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (తెరి), కేంద్ర జలశక్తి శాఖ, యుఎన్‌డిపి ఇండియా సంయుక్తంగా వాటర్‌ సస్టయినబిలిటీ అవార్డ్స్‌ను వరుసగా మూడో ఏడాది ప్రదానం చేశాయి. సమర్థవంతంగా నీటి వినియోగానికి దోహదపడిన వారికి 8 విభాగాల్లో పురస్కారాలను అందించారు.

‘ఎక్సలెన్స్‌ ఇన్‌ వాటర్‌ యూజ్‌ ఎఫీషియన్సీ – అగ్రికల్చర్‌ సెక్టార్‌’ విభాగంలో ప్రధమ బహుమతిని సిఇసి డైరెక్టర్‌ గోపాల్‌ గెల్చుకున్నారు. సాధారణ డ్రిప్‌ భూమి పైనే బిందువులుగా నీటిని పంటలకు అందిస్తుంది. గోపాల్‌ రూపొందించిన స్వర్‌ డ్రిప్‌ భూమి లోపల మొక్కల వేరే వ్యవస్థకే నేరుగా నీటిని అందిస్తుంది. అందువల్ల సాధారణ డ్రిప్‌ కన్నా నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవటం దీని ద్వారా సాధ్యమవుతుంది.

ఇవి చదవండి: Srinath Ravichandran: స్పేస్‌ టెక్‌ స్టార్టప్‌ - అంతరిక్షంలో అగ్ని సంతకం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement