Too Much Dieting Lead To Eating Disorder Symptoms Causes In Telugu - Sakshi
Sakshi News home page

అలా చేయడం డైటింగ్‌ కాదు..ఈటింగ్‌ డిజార్డర్‌! అదోక మానసిక సమస్య

Published Mon, Jul 24 2023 11:04 AM | Last Updated on Mon, Jul 24 2023 1:21 PM

Too Much Dieting Lead To Eating Disorder Symptoms Causes - Sakshi

దియా హైదరాబాద్‌లో ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌. 50 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల ముగ్ధలా కనిపించాలని తాపత్రయపడుతుంటుంది. ప్రతిరోజూ ఉదయమే బరువు చెక్‌ చేసుకుంటుంది. తన వయసుకు, ఎత్తుకు తగ్గ బరువే ఉన్నా ఆమెకు సంతృప్తిగా ఉండదు. తానింకా బరువు తగ్గాలని విపరీతంగా డైటింగ్‌ చేస్తుంది. ఎక్సర్‌సైజుల సంగతి సరేసరి. వీటన్నింటివల్ల ఆమె ఆరోగ్యంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. రెండు నెలల కిందట రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌ చేయిస్తే గుండె క్రమరాహిత్యంగా కొట్టుకుంటోందని (అరిథ్మియా), రక్తపోటు కూడా తక్కువగా (హైపోటెన్షన్‌) ఉందని తేలింది.

అయినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి వర్పు రాలేదు. చివరకు మొన్న కళ్లు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కూడా డైటింగ్‌ గొడవే. దాంతో అది ఆరోగ్య సమస్య కాదని, మానసిక సమస్యని గుర్తింన డాక్టర్‌ సైకో డయాగ్నసిస్‌కి పంపించారు. దియా అనోరెక్సియా నెర్వోసా అనే ఈటింగ్‌ డిజార్డర్‌తో బాధపడుతోంది. ఇది తిండికి సంబంధింన ఒక మానసిక సమస్య.

బరువు పెరుగుతామనే భయం దీని ప్రధాన లక్షణం. దాంతో విపరీతంగా డైటింగ్‌ చేస్తుంటారు. దానివల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు రావడంతోపాటు, మరణానికి కూడా దారి తీస్తుంది. సాధారణంగా టీనేజ్, తదుపరి వయసు మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. పిల్లలు, పురుషులు, వృద్ధుల్లో కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఒకటి నుంచి రెండు శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది.

రూపాన్ని బట్టి చెప్పలేం..
ఒక వ్యక్తి రూపాన్ని బట్టి అనోరెక్సియా ఉందో లేదో చెప్పలేం. మామూలు బరువు ఉన్న వ్యక్తుల్లో కూడా ఈ రుగ్మత ఉండవచ్చు. అలాగే ఈ రుగ్మత లేకున్నా తక్కువ బరువుతో ఉండవచ్చు. కాబట్టి అనోరెక్సియాను గుర్తించడానికి శారీరక, వనసిక, భావోద్వేగ, ప్రవర్తనా సంకేతాలను గుర్తించాల్సి ఉంటుంది.

భావోద్వేగ, మానసిక సంకేతాలు: బరువు పెరుగుతుందనే తీవ్రమైన భయం, తక్కువ బరువు ఉన్నప్పటికీ కొవ్వు ఉన్న ఫీలింగ్, విపరీతమైన డైటింగ్, స్వీయహాని, ఆత్మహత్య ఆలోచనలు. ప్రవర్తనా సంకేతాలు: ఆహారపు అలవాట్లు లేదా దినచర్యలలో మార్పులు, కొన్ని ఆహారాలను మానేయడం, ఆకలిని అణచివేసే మందులను ఉపయోగించడం, మితిమీరిన వ్యాయామం. శారీరక సంకేతాలు: కొన్ని వారాలు లేదా నెలల్లో గణనీయమైన బరువు తగ్గడం, బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) లో వివరించలేని మార్పు, తరుచుగా అలసిపోయినట్లు అనిపించడం, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం (బ్రాడీకార్డియా), ఋతు క్రమం సక్రమంగా లేకపోవడం, ఆబ్సెంట్‌ పీరియడ్స్‌ (అమెనోరియా)

‘జీరో సైజ్‌’ కూడా కారణమే..

  • అనోరెక్సియాకు కచ్చితమైన కారణం తెలియదు. అయితే కొన్ని జన్యుపరమైన అంశాలు, వనసిక లక్షణాలు, పర్యావరణ కారకాలు, ముఖ్యంగా సామాజిక సాంస్కృతిక కారకాల కలయిక దీనికి కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి.
  • ఈటింగ్‌ డిజార్డర్స్‌ దాదాపు 50% నుంచి 80% జన్యుపరమైనవని పరిశోధనలు సూచిస్తున్నాయి.
  • ఈ డిజార్డర్‌తో బాధపడే తోబుట్టువులు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఈ రుగ్మత అభివృద్ధి చెందడానికి 10 రెట్లు ఎక్కువ అవకాశం ఉంది.
  • మెదడు రివార్డ్‌ సిస్టమ్, సెరోటోనిన్, డోపమైన్‌ వంటి న్యూరో ట్రాన్స్‌మిటర్లలో మార్పులు.
  • శారీరక వేధింపులు లేదా లైంగిక వేధింపులు కూడా ఈటింగ్‌ డిజార్డర్‌ రావడానికి కారణమవుతాయి.
  • జీరోసైజ్‌ ఉన్నవారే అందమైనవారనే అవాస్తవ శరీర ప్రమాణాలు.
  • తోటివారి టీజింగ్, అపహాస్యం, బెదిరింపులు.. · మానవ సంబంధాలు సరిగా లేకపోవడం, ఆత్మగౌరవం తగ్గడం!

దీర్ఘకాల చికిత్స అవసరం..
మీరు అనోరెక్సియాతో బాధపడుతుంటే ముందుగా మీ కుటుంబ సభ్యులకు తెలపండి. దాని గురించి అవగాహన పెంచుకోండి. తగినంత నిద్ర పొందండి. మద్యం లేదా డ్రగ్స్‌కి దరంగా ఉండండి. దీనికి చికిత్స సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి ఓపిగ్గా ఉండాలి. · అయితే ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా తమకు సమస్య ఉందని గుర్తించరు, అంగీకరించరు. పరిస్థితి తీవ్రమై ప్రాణాంతకమైనప్పుడు మాత్రమే వారు కిత్సను కోరుకుంటారు. అందువల్ల కుటుంబ సభ్యులే దీన్ని ప్రారంభదశలోనే గుర్తిం చికిత్స చేయించడం చాలా ముఖ్యం.

అనోరెక్సియా చికిత్సలో న్యూట్రిషన్‌ కౌన్సెలింగ్, సైకోథెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్, మందులు ఉంటాయి. అవసరమైతే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ఈ రుగ్మతతో బాధపడే వ్యక్తులు ఇతర మానసిక సమస్యలను కూడా కలిగి ఉంటారు. వాటిని కూడా గుర్తిం సైకోథెరపీ అందించాల్సి ఉంటుంది. · ఆహారం, బరువు పట్ల ఆరోగ్యకరమైన వైఖరిని పెంపొందించడానికి అందించే మానసిక చికిత్సలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ (cognitive behavior therapy), డైలెక్టిక్‌ బిహేవియర్‌ థెరపీ (pydialectic behavior therapy) , ఇంటర్‌పర్సనల్‌ సైకో థెరపీ ( interpersonal psychotherapy ), సైకోడైనమిక్‌ సైకోథెరపీ (psychodynamic psychotherapy), ఫ్యామిలీ బేస్డ్‌ థెరపీ (family based therapy) ముఖ్యమైనవి.

-సైకాలజిస్ట్‌ విశేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement