సమ్మర్‌లో వేడి నీళ్ల స్నానమా? ఈ సర్‌ప్రైజింగ్‌ విషయాలు తెలుసా? | What Are Some Health Benefits Of Taking A Hot Bath In Summer? - Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో వేడి నీళ్ల స్నానమా? ఈ సర్‌ప్రైజింగ్‌ విషయాలు తెలుసా?

Published Wed, Mar 27 2024 3:56 PM | Last Updated on Wed, Mar 27 2024 4:24 PM

Surprising Health Benefits of Hot Bath in Summer check details here - Sakshi

ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా స్నానం చేయడం దాదాపు అందరికీ అలవాటు. కొందరు వేడి నీటితో, మరికొందరు చల్లటి నీటితో స్నానం చేస్తారు. కానీ వేడి నీటి (  మరీ వేడి నీళ్లు కాదు) స్నానంతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి  సీజన్‌ ఏదైనా వామ్‌ వాటర్‌తో స్నానంతో శరీరం, మనస్సు సేద తీరుతాయి. మరి వేడి నీటి  స్నానంతో ఇంకా ఎలాంటి ప్రయో జనాలున్నాయో  చెక్‌ చేద్దామా?

చలికాలంలో వేడి స్నానం చేయడం కామన్‌. కానీ వేసవిలో కూడా వేడి నీటి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదే. అన్ని సీజన్లలో వేడి స్నానం చేయడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గుండెజబ్బులు, అధిక బీపీ ఉన్న వారు కొంచెం  అప్రతమత్తంగా ఉండాలి. 

కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది
రోజంతా పనిచేసి అలిసిపోయిన  శరీరానికి,  కండరాలకు వేడి నీటి స్నానం హాయినిస్తుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు. కీళ్లకు ఉపశమనం కలుగుతుంది. 

ఒత్తిడిని తగ్గించడంలోసహాయపడుతుంది
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి చాలా కామన్‌ అయిపోయింది. అందువల్ల, మనస్సు ప్రశాంతంగా, పూర్తిగా రిలాక్స్‌గా ఉండాలంటే వేడి స్నానం ఉత్తమం. ఇందులో  ఎప్సమ్ లవణాలు, మంచి సువాసన గల నూనెలు కూడా ఉపయోగించవచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల  వల్ల  చర్మ రంధ్రాలు తెరుచు కుంటాయి .పేరుకుపోయిన మురికి, శరీరం శుభ్రపడి, బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తుంది. 
చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది
అందరికీ ఆరోగ్యకరమైన చర్మాన్నే కోరుకుంటారు. ఇందుకోసం కొంతమంది సౌందర్య సాధనాలు  ఆశ్రయిస్తారు. కానీ,  రోజువారీ వేడి స్నానంలో రహస్యాన్ని మర్చిపోకూడదు. వేడినీరు చర్మాన్ని హైడ్రేట్ చేసి, చర్మ కణాలలో ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా మృదువైన స్కిన్‌ సొంతమవుతుంది. ఏర్పడుతుంది.
రక్త ప్రసరణకు: శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అన్ని శరీర భాగాల సరైన పనితీరు సరైన రక్తప్రసరణచాలా అవసరం.   ముఖ్యంగా   గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  కూడా  ఇది కీలకం.
మంచి నిద్రకు: వేడి నిటి  షవర్ కండరాల ఒత్తిడిని తగ్గిస్తుందని ముందే చెప్పుకున్నాం కదా. దీని ఫలితంగా ప్రశాంతమైన మెదడు మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
జుట్టుకు:  జుట్టుకు చాలా ప్రయోజనకరం. స్కాల్ప్‌ లోని సూక్ష్మ  రంధ్రాలు ఓపెన్‌ అయ్యి,  తేమ లోపలికి వెళ్లేలా చేస్తుంది. స్కాల్ప్‌ను శుభ్రనడుతుంది. బాగా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలకే కాదు, చుండ్రు లాంటి నిరోధానికి కూడా కీలకం. ఇక శీతాకాలంలో అయితే  జలుబు , ఫ్లూ బారిన పడటం చాలా సాధారణం. అందుకే వేడి షవర్ తలనొప్పి,  ముక్కు దిబ్బడ, జలుబుకి మంచి ఉపశమనం. 

టిప్‌: ఎప్సమ్ లవణాలు, 10 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్,అర కప్పు బేకింగ్ సోడా కలుపుకొని వారానికి ఒకసారి 20 నిమిషాలు, హాట్‌ బాత్‌ టబ్‌లో కూర్చోండి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. ఒత్తిడి సంబంధిత హార్మోన్లను తగ్గిస్తుంది, శరీర pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement