ఒత్తిడి కూడా మంచిదే!.. స్ట్రెస్‌ పెరిగిపోయిందా? ఇలా చేయండి Steps To Improve Your Mental Health And Well Being | Sakshi
Sakshi News home page

Steps To Improve Your Mental Health: మానసిక ఒత్తిడికి గురవుతున్నారా? ఇలా చేయండి

Published Tue, Sep 5 2023 2:50 PM | Last Updated on Tue, Sep 5 2023 4:49 PM

Steps To Improve Your Mental Health And Well Being - Sakshi

ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అందుకు కారణాలు లేకపోలేదు. జీవనశైలిలో మార్పులు, తినే ఆహారం, మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు.. తదితర కారణాల వల్ల డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఇలాగే ఒత్తిడిలోనే ఎక్కువ కాలం గడిపేవారికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని అదుపులో ఉంచుకోకపోతే ఇతర అనారోగ్యాలూ చుట్టుముట్టే ప్రమాదం ఉంది. మరి మానసిక ఒత్తిళ్ల నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి? అన్నది ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. నవీన్‌ నడిమింటి మాటల్లోనే తెలుసుకుందాం. 

మనసుకు కష్టం కలిగినప్పుడు మెదడు ఎంతో ఒత్తిడికి గురవుతుంది. తక్కువ స్థాయిలో ఉండే ఒత్తిడి ఉద్రిక్తత.. కొన్ని సందర్భాల్లో లాభదాయకంగానే ఉంటుంది. ఉదాహరణకు.. ఒక ప్రాజెక్ట్‌ లేదా ఏదైనా పనిని నిర్వహిస్తున్నప్పుడు తక్కువ స్థాయిలో కలిగే ఒ‍త్తిడి మనం చేసే పనిని మరింత కేంద్రీకరించి పనిని మరింత, శక్తివంతంగా, ఉత్సాహవంతంగా పూర్తి చేసేటట్లు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడిలో రెండు రకాలున్నాయి. వాటిలో స్ట్రెస్ (‘అనుకూలవంతమైన ప్రోత్సాహకరమైన ఒత్తిడి’)డిస్ట్రెస్ ‘ప్రతికూలమైన, నిరుత్సాహకరమైన ఒత్తిడి‘( ఛాలెంజ్ మరియు అదనపు బరువు) 

ఒత్తిడిని తట్టకునేందుకు చాలామంది పొగత్రాగడం, మద్యం సేవించడం, అతిగా తినడం, ఎక్కువ గంటలు నిద్రపోవడం, ఇతరులపై విరుచుకుపడటం, కోపంతో అరిచేయడం వంటివి చేస్తుంటారు. కానీ వీటివల్ల మంచి జరగడం పక్కపపెడితే ఎక్కువగా చెడు జరుగుతుంది.​ అందుకే స్ట్రెస్‌ను అదుపులో ఉంచుకునేందుకు డా. నవీన్‌ నడిమింటి సలహాలు

మనసు భారంగా, ఒత్తిడిగా అనిపిస్తే కాసేపు వాకింగ్‌కు వెళ్లండి
ప్రకృతి అందాలను చూస్తూ కాసేపు కాలక్షేపం చేయండి
ఒక మంచి స్నేహితుడితో మాట్లాడండి. రిలీఫ్‌గా అనిపిస్తుంది
వ్యాయామానికి మించిన పని ఇంకొకటి ఉండదు. 
జర్నల్‌ రాయడానికి ప్రయత్నించండి.
వెచ్చటి కప్పు కాఫీ, టీ తాగండి. సువాసన వెదజల్లే ఓ కొవ్వొత్తిని వెలిగించండి.
మీ పెంపుడు జంతువులతో కాసేపు కాలక్షేపం చేయండి
మంచి పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి.
ఫన్నీ మూవీస్‌ చూడండి. గార్డెనింగ్‌ అలవాటు చేసుకోండి

ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఏం చేయాలన్నది మీ ఇంట్రెస్ట్‌ మీద ఆధారపడి ఉంటుంది. తీరిక వేళల్లో మీకు సంతోషాన్ని పనులు చేయండి. పియానో వాయించడమో, పాటలు పాడటమో..ఇలా ఏదైనా సరే మీకు నచ్చింది చేయండి. 

ఇవి చాలా అవసరం...
ఆహారాన్ని మెరుగుపరచే గ్రూప్ బి, విటమిన్లు, మెగ్నీషియం చాలా ముఖ్యమైనవి. ఒత్తిడి నుంచి కాపాడుకోవడానికి విటమిన్‌-సి చాలా అవసరమైనది. విటమిన్‌ డి శరీర పోషణకు, మెదడుకు సరిపోయినంత స్ధాయిలో ఖనిజాలను తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌, అధికంగా ఉప్పు ఉండే పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. 

డా. నవీన్ నడిమింటి,
ప్రముఖ ఆయుర్వేద నిపుణులు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement