నవజాత శిశువులను కాపాడే అరుదైనా బ్లడ్‌ గ్రూప్‌! | Special Neo Blood For Babies Especially CMV Negative | Sakshi
Sakshi News home page

నవజాత శిశువులకు బ్లడ్‌ ఎక్కించాల్సి వస్తే.. ఏ గ్రూప్‌ రక్తాన్ని ఇస్తారంటే..!

Published Sun, Feb 18 2024 5:19 PM | Last Updated on Sun, Feb 18 2024 5:42 PM

Special Neo Blood For Babies Especially CMV Negative  - Sakshi

రక్తమార్పిడ్లు గురించి విన్నాం. చాలామందికి ప్రమాద కారణంగానో లేదా మరే ఇతర కారణాల వల్ల రక్తం ఎక్కించాల్సి ఉంటంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ నవజాత శిశువులకు కూడా ఒక్కోసారి జననంలో ఎదురయ్యే సమస్యల కారణంగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అయితే వారికి ఎక్కించే రక్తం విషయంలో మాత్రం వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పైగా ఎక్కించాక ఏవైనా సమస్యల రాకుండా పలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ నవజాత శిశువులకు ఎలాంటి రక్తాన్ని ఎక్కిస్తారు? ఆ రక్తానికి ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారంటే..

అత్యంత అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ బీ-ని నవజాత శిశువులకు ఎక్కిస్తారు. ఆ రక్తాన్ని నియో అనే బ్లడ్‌ని   బ్లూ ట్యాగ్ బ్యాగ్‌లె కలెక్ట్‌ చేస్తారు. ఎందుకంటే? ఈ బ్లడ్‌ అప్పుడే పుట్టిన శిశువులకు ఇచ్చేది కాబట్టి దానిపై నియో అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. ఇక్కడ ‘నియో’ అంటే నియోనాటల్. 28 రోజుల వయసున్న చిన్నారుల గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడుతుంటారు. ఇక ఈ రక్తం నవజాత శిశువులతో పాటు కొందరు రోగులకు సాయం చేస్తుంది. 

ఎలాంటి పరీక్షలు చేస్తారంటే..
సాధారణంగా దానం చేసిన రక్తంనతంటికీ హెచ్ఐవీ, హెపటీటిస్ బీ, సీ, ఈ, అలాగే సిఫిలిస్ వంటి పరీక్షలు చేపడతామని హెమటాలసీ డాక్టర్‌ ఆండీ చార్టన్ వివరించారు.
ఆ పరీక్షలు అన్ని పూర్తి అయిన తర్వాత రోగులకు సరిపోతుందా? లేదా? అని అనేది తెలుసుకోవడం కోసం కొన్ని శాంపిల్స్‌ తీసుకుని మరిన్ని పరీక్షలను, ప్రక్రియలను చేపడతామని చెప్పారు.
అంటే..కొందరి వ్యక్తులకు అంతకుముందు రక్తమార్పిడి సమయంలో వచ్చిన అలర్జిక్ రియాక్షన్ల ప్రొటీన్లు తొలగించిన తర్వాత రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుందని తెలిపారు

శిశువులకు ఎక్కించాలంటే తప్పనసరిగా ఆ పరీక్ష..

  • నవజాత శిశువులకు, ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పేషెంట్లకు(రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న రోగులకు), గర్భిణులకు, గర్భాశయంలో ఎదిగే పిండానికి ఎక్కించే రక్తానికి తప్పనిసరిగా సైటోమెగాలో(CMV) అనే వైరస్‌కు సంబంధించి పరీక్షించాల్సి ఉంటుంది.
  • ఇది హెర్పస్ వైరస్ కుటుంబానికి చెందినది. ఈ వైరస్ చాలా సాధారణం. ఇది హానికరమైనది కాదు. స్వల్పంగా ఫ్లూ వంటి లక్షణాలను లేకపోతే ఎలాంటి లక్షణాలను ఇది కలిగి ఉండదు. కానీ, కొందరికి మాత్రం ఇది ప్రమాదకరం.
  • ఈ వైరస్ వల్ల పిల్లలకి మూర్ఛ రావొచ్చు, కళ్లు మసకబారడం, వినికిడి సమస్యలు తలెత్తవచ్చు.
  • అలాగే కిడ్నీ, ప్లీహాన్ని దెబ్బతీయొచ్చు. చాలా అరుదైన కేసుల్లో ఇది ప్రాణాంతకం కావొచ్చు.
  • ఒకవేళ రక్తంలో ఈ వైరస్ ఉంటే అది ఇలాంటి శిశువులకు, రోగులకు ఇవ్వడానికి పనికిరాదు.

అయితే ఈ రక్తం దొరకడం అనేది అత్యంత అరుదు. అందువల్ల ఈ రక్తం గల దాతలు ఇచ్చేందుకు ముందుకు వస్తే ఎందరో ప్రాణాలను రక్షించిన వారవ్వుతారు. దయచేసి బీ నెగిటివ్‌ గ్రూప్‌ కల వారు తమ రక్తం ఎంతో అమూల్యమైనదని గర్వించడమే గాకుండా ఇచ్చేందుకు ముందుకు వస్తే ఎన్నో ప్రాణాలను రక్షించిన వారవ్వుతారు. 

(చదవండి: దంగల్‌ నటి సుహాని భట్నాగర్‌ మృతికి ఆ వ్యాధే కారణం! వెలుగులోకి షాకింగ్‌ విషయాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement