దిండు లేకుండా పడుకోలేరా? ఈ సమస్యలు తప్పవు Sleeping Without Pillow Is Bad For Your Health | Sakshi
Sakshi News home page

దిండు లేకుండా పడుకోలేరా? ఈ సమస్యలు తప్పవు

Published Sat, Jul 22 2023 10:13 AM | Last Updated on Thu, Jul 27 2023 4:37 PM

Sleeping Without Pillow Is Bad For Your Health - Sakshi

రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామంది తలకింద దిండు పెట్టుకొని పడుకుంటారు. అయితే తక్కువ ఎత్తు ఉన్న దిండు ఫరవాలేదు కానీ, పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఇది మొదట్లో తెలియదు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి ఎదురవుతుంది. ఈ నొప్పి దీర్ఘకాలికంగా వేధిస్తుంది.

కొంతమందికి ఉదయం నిద్రలేవగానే వెన్నులో నొప్పితో బాధపడతారు. మీకు ఇలాంటి సమస్య ఎదురైతే పడుకునేటప్పుడు మీరు ఎత్తయిన దిండు ఉపయోగిస్తున్నట్లు లెక్క. దీనివల్ల వెన్నెముక వంగిపోతుంది. డిస్క్‌లలో దరం పెరిగి వెన్నునొప్పి వస్తుంది. అందువల్ల దిండు లేకుండా నిద్రించడం అలవాటు చేసుకోవాలి. 

తలలో రక్త ప్రసరణ జరగదు:
ఎత్తయిన దిండు పెట్టుకొని నిద్రపోతే తలకి రక్త సరఫరా సరిగ్గా జరగదు. రాత్రిపూట చాలా గంటలు ఇలాగే ఉండటం వల్ల రక్త సరఫరా లేక జుట్టుకు సరైన పోషణ లభించదు. దీనివల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. అంతేకాదు, తరచు తలనొప్పి వస్తుంది. లావుపాటి దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలకి రక్త సరఫరా సరిగ్గా అందక తిమ్మిర్ల సమస్యలు ఏర్పడుతాయి.

అందువల్ల మెడనొప్పి ఉండకూడదంటే తక్కువ ఎత్తు ఉండే చిన్న దిండుని ఉపయోగించాలి లేదంటే మెత్తటి టవల్‌ లేదా పలుచటి దుప్పటిని మడత పెట్టి తలకింద పెట్టుకోవడం ఉత్తమం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement