గజరాజు ప్రతాపం : అమాంతం ఎత్తి పడేసింది! వీడియో వైరల్‌ | Viral Video: Scary Moment For Tourists Elephant Lifted Safari Truck Suddenly, Check What Happened - Sakshi
Sakshi News home page

Shocking Elephant Video: అమాంతం ఎత్తి పడేసింది! వీడియో వైరల్‌

Published Fri, Mar 22 2024 5:24 PM | Last Updated on Fri, Mar 22 2024 6:47 PM

Scary Moment Tourists Elephant Lifted Truck suddenly check what happened - Sakshi

  టూరిస్టులకు చేదు అనుభవం

టూరిస్టుల ట్రక్‌ను అమాంతం ఎత్తిపడేసిన గజరాజు

భయంతో  గజ గజ లాడిపోయిన టూరిస్టులు

సరదాగా  సఫారీకి వెళ్లిన టూరిస్టులు చేదులో అనుభవం ఎదురైంది.  తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట​ వైరల్‌గా మారింది. ఒక ఏనుగును దగ్గరినుంచి చూడాలనుకుని ముచ్చపట్టారు. అంతటితో ఆగకుండా ఫోటో తీయాలని  ప్రయత్నించారు. అంతే క్షణాల్లో ఊహంచని పరిణామం ఎదురైంది. ఏనుగు సఫారీ ట్రక్కును అమాంతం  దొర్లించేసింది.  దక్షిణాఫ్రికాలోని పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో  ఈ ఘటన  చోటు చేసుకుంది.

అసలు ఏమైందంటే...
ఏబీసీ న్యూస్‌ రిపోర్ట్‌ ప్రకారం పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో  22 సీటర్  ట్రక్కులో పర్యాటకులు సఫారీకి వెళ్లారు. ఇంతలో భారీ ఏనుగు కనిపించింది. పర్యాటకులు ఫోటోలు తీయడానికి ప్రయత్నించినపుడు ఏనుగు మరింత దగ్గరగా  వచ్చింది. ఉన్నట్టుండి ట్రక్‌పైదాడి చేసింది. ఏనుగును ట్రక్కును అమాతం ఎత్తేసింది. ఇలా చాలా సార్లు పడేసింది. దీంతో ట్రక్‌ లోపల ఉన్నవాళ్లంతా భయంతో వణికి పోయారు. సీట్ల కింద దాక్కున్నారు.  ఇంతలో డ్రైవర్‌ పో...ఫో గట్టిగా అదిలించాడు. ట్రక్‌పై కొడుతు పెద్దగా శబ్దం చేశాడు. దీంతో ఏనుగు భయపడిందో.. శాంతించిందో తెలియదు గానీ పక్కకు తొలగిపోయింది.  దీంతో అందరూ బతుకు జీవుడా అనుకున్నారు. హెండ్రీ బ్లోమ్  ఈ సంఘటనను కెమెరాలో బంధించాడురు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఏనుగు ట్రక్కు దగ్గరకు వచ్చిన సమయంలో పర్యాటకులు ఫోటోలు తీయాలనుకున్నందున అది దూకుడుగా  ప్రవర్తించిందని   పార్క్‌ అధికారి తెలిపారు ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదన్నారు. అయితే  బాగా బెంబేలెత్తిపోయిన ఒక కుటుంబానికి కౌన్సెలింగ్‌  ఇచ్చినట్టు టూర్ కంపెనీ మాంక్వే గేమ్ ట్రాకర్స్ వెల్లడించారు. మరోవైపు టూర్ గైడ్  సమయానుకూలంగా వ్యవహరించిన తీరును వన్యప్రాణి నిపుణులు ప్రశంసించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement