అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో ఆ కేఫ్‌ విందు..! Rameshwaram Cafe food On Anant Ambani Radhika Merchants Pre Wedding Cruise | Sakshi
Sakshi News home page

అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లోఆ కేఫ్‌ విందు..!

Published Sun, Jun 2 2024 2:05 PM | Last Updated on Sun, Jun 2 2024 2:05 PM

Rameshwaram Cafe food On Anant Ambani Radhika Merchants Pre Wedding Cruise

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌-రాధిక మర్చంట్‌ రెండొవ ప్రీ వెడ్డింగ​ వేడు క్రూయిజ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అందులోనూ అంబానీల ఇంట జరిగే ఆఖరి పెళ్లి కావడంతో మరింత గ్రాండ్‌గా కన్నుల పండుగగా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరిగాయి. ఈ రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుకులు దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్‌లో రెండో ప్రీ-వెడ్డింగ్‌ జరిగింది.  

శనివారం (జూన్ 1, 2024న) ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంతో ముగుసింది. అయితే ఈ వేడుకకు విచ్చేసిన అతిరథ మహారథులకు రామేశ్వరం కేఫ్‌ విందు అందిచిందట. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రాంలో వెల్లడించి రామేశ్వరం కేఫ్‌. సెలబ్రిటీ అసెంట్‌ క్రూయిజ్‌లో బెస్ట్‌ ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రెషన్స్‌లో పాల్గొన్నందకు సంతోషంగా ఉందని రామేశ్వరం రెస్టారెంట్‌ పేర్కొంది. అనంత్‌ అంబానీ రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ​ వేడుకల్లో సౌత్‌ ఇండియన్‌ వంటకాలను అందించే ఏకైక సంస్థ తామేనని కేఫ్‌ సగర్వంగా పేర్కొంది. 

సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది స్వయంగా రామేశ్వరం కేఫ్‌ కోఫౌండర్‌ రాఘవేంద్రరావు. అంతేగాదు ప్రపంచంలోని అత్యుత్తమ వివాహ వేడుకలో తాము భాగమయినందుకు ఎంతగానో సంతోషిస్తున్నామని తెలిపారు. కాగా ఈ ఏడాది జామ్‌నర్‌లో జరిగిన మొదటి ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో కూడా రామేశ్వరం కేఫ్‌ భాగమయ్యింది. ఇటీవలే జరిగిన రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో కూడా రామేశ్వరమే విందు అందించడం విశేషం. కాగా, ఈ వేడుకల్లో సుమారు 800 మందికి ఆతిథ్యం ఇచ్చింది అంబానీ కుటుంబం. ఈ విందులో జపాన్‌, మెక్సికోతో సహ వివిధ వంటకాలతో కూడిన అంతర్జాతీయ మెనూని అందించారు. దీంతోపాటు ఈ వేడుకలో ఇంటి రుచిని అందించే వంటకాలను కూడా జోడించడం విశేషం.

(చదవండి: ఈ గ్రామం చాలా స్పెషల్‌!..కిచెన్‌ ఒక దేశంలో ఉంటే..బెడ్‌రూం ఏకంగా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement