ఈ పోర్టబుల్‌ డివైజ్‌ ఉంటే ఇంట్లోనే ఈజీగా రోల్‌ మసాజ్‌! | This Portable Roller For Full Body Massage At Home Everyday | Sakshi
Sakshi News home page

ఈ పోర్టబుల్‌ డివైజ్‌ ఉంటే ఇంట్లోనే ఈజీగా రోల్‌ మసాజ్‌ చేసుకోవచ్చు!

Published Tue, Oct 24 2023 7:38 AM | Last Updated on Tue, Oct 24 2023 8:42 AM

This Portable Roller For Full Body Massage At Home Everyday - Sakshi

చర్మం బిగుతుగా.. మృదువుగా మెరవాలంటే తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. అందులో ఈ ప్రత్యేకమైన రోల్‌ మసాజ్‌ ట్రీట్‌మెంట్‌ మంచి ఫలితాన్ని అందిస్తోంది. 

జపనీస్‌ టెక్నాలజీతో రూపొందిన ఈ బ్యూటీ ఫేస్‌ రోలర్‌.. వినియోగం చాలా తేలిక. ముఖ కండరాలను ఉత్తేజపరచడంలో.. చర్మం మీదున్న ముడతలు తగ్గించడంలో.. ఇది ఎంతగానో సహకరిస్తుంది. దీనికి చార్జింగ్‌ పెట్టుకుని వినియోగించుకోవాలి. సుమారు 90 నిమిషాల పాటు చార్జింగ్‌ పెట్టుకుంటే.. 150 నిమిషాల పాటు ఈ డివైస్‌ నిరంతరాయంగా పని చేస్తుంది. ఈ చర్మ సంరక్షణ పరికరాన్ని ఈజీగా ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు.

దీనిలో రెండు రోల్స్‌.. వి షేప్‌లో ఫిక్స్‌ చేసి ఉంటాయి. అవి చర్మం మీద సులభంగా రోల్‌ అవుతాయి. బుగ్గలు, మెడ భాగాల్లోని ఒంపుల్లో మసాజ్‌ చేసుకోవడానికి వీలుగా ఇది రూపొందింది. వైబ్రేట్‌ అవుతూ మసాజ్‌ చేసేందుకు ఇవి అనువుగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్‌ స్టిమ్యులేషన్‌.. ఫేస్‌ని ఎంతగానో మెరిపిస్తుంది. దీని ధర 32 డాలర్లు. అంటే 2,664 రూపాయలు. అయితే ఈ ట్రీట్‌మెంట్‌కి ముందు చర్మాన్ని శుభ్రంగా చల్లటి వాటర్‌తో కడుక్కుని.. మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి. మోడ్స్‌ ఆన్‌ చేసుకుని.. మసాజర్‌ వినియోగించుకోవాలి. ఇది ఆన్‌లో ఉంటే.. సుమారు మూడు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవుతుంది.

గ్లాస్‌ స్కిన్‌ కోసం..
ఒక కప్‌ ఓట్స్‌.. ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెకు ఒక టేబుల్‌ స్పూన్‌ రోజ్‌ వాటర్‌ యాడ్‌ చేసి అది పేస్ట్‌లా మారేవరకు బాగా కలిపి ఆ పేస్ట్‌తో ఫేస్‌ రుద్దుకుని ఓ 15 మినిట్స్‌ వరకు అలా వదిలేయాలి. తర్వాత చన్నీళ్లతో ఫేస్‌ వాష్‌ చేసుకుని మాయిశ్చరైజర్‌ అప్లయ్‌ చేసుకోవాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement