కమెడియన్‌ శ్రద్ధా జైన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు PM Modi lauds Comedian Shraddha Jain as digital ambassadors of India | Sakshi
Sakshi News home page

కమెడియన్‌ శ్రద్ధా జైన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

Published Wed, Mar 13 2024 10:11 AM | Last Updated on Wed, Mar 13 2024 10:25 AM

PM Modi lauds Comedian Shraddha Jain as digital ambassadors of India - Sakshi

శ్రద్ధగా నవ్విస్తుంది! 

శ్రద్ధా జైన్‌.‘శ్రద్ధా జైన్‌ తెలుసా?’ అని అడిగితే – 
‘తెలుసు’ అని చెప్పేవారి సంఖ్య తక్కువ కావచ్చుగానీ–
‘అయ్యో శ్రద్ధా తెలుసా’ అంటే 
‘అయ్యో... తెలియకపోవడం ఏమిటి!’ అనే వాళ్ల సంఖ్య ఎక్కువే.
బెంగళూరుకు చెందిన శ్రద్ధా జైన్‌ అలియాస్‌ ‘అయ్యో శ్రద్ధా’
‘ఇంటర్నెట్‌ సెన్సేషన్‌’గా పేరు తెచ్చుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 
ఇటీవల ‘నేషనల్‌ క్రియేటర్స్‌’ అవార్డ్‌ అందుకుంది

హాయిగా నవ్వించే వీడియోలతో సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయింది శ్రద్ధా జైన్‌. తులు, కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్‌ భాషలలో ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా వీడియోలు  పోస్ట్‌ చేస్తుంటుంది.

2016లో కర్నాటకాలో జరిగిన ఒక ఫెస్టివల్‌కు సంబంధించి ఫేస్‌బుక్‌ వీడియోను పోస్ట్‌ చేసింది. వైరల్‌ అయిన ఈ వీడియో శ్రద్ధాకు వీర లెవెల్లో పేరు తెచ్చింది. ఒక డ్యాన్స్‌ రియాల్టీ షోకు హోస్ట్‌గా, కొన్ని టీవీ కార్యక్రమాలకు క్రియేటివ్‌ డైరెక్టర్‌గా అవకాశాలు తెచ్చింది. ఇక కామేడీ షోల సంగతి సరే సరి. కామెడీ డ్రామా సిరీస్‌ ‘పుష్పవల్లి’తో శ్రద్ధ పేరు హాస్యాభిమానుల అభిమాన పేరు అయింది. పెద్ద బ్రాండ్స్‌తో కలిసి పనిచేసిన శ్రద్ధ ఇలా అంటుంది...

‘కంటెంట్‌లో వెరైటీ ఉండేలా ప్రయత్నించేదాన్ని. ప్రేక్షకుల సంగతి ఏమిటోగానీ కంటెంట్‌లో వెరైటీ లేకపోతే ముందు నాకే బోర్‌ కొడుతుంది. అది ఎంత పెద్ద హిట్‌ అయినా సరే ఒకే అంశాన్ని పదేపదే చేయలేను. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ఉన్న వారికి ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్సర్‌ను ఎంపిక చేసుకోవాలో తెలియదు. నేను సృష్టించిన రీనా దలాల్‌ క్యారెక్టర్‌ను చూసిన తరువాత... రీనా క్యారెక్టర్‌ పర్‌ఫెక్ట్‌ అనుకున్నారు. మొదట్లో  రియల్‌ ఎస్టేట్‌ కోసం కంటెంట్‌ క్రియేట్‌ చేసిన అతి కొద్దిమందిలో నేను ఒకరిని’ అంటుంది శ్రద్ధ.

ఏ బ్రాండ్‌ వారు వచ్చినా తమది ఏ బ్రాండ్‌ అనేది మాత్రమే చెబుతారు. వారికి ‘ఐడియా’ గురించి బొత్తిగా ఐడియా ఉండదు. ఈ నేపథ్యంలో ఐడియా జెనరేట్‌ చేయడం నుంచి స్క్రీన్‌ప్లే వరకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో చేయాల్సి  ఉంటుంది. ఇలాంటి అన్ని విద్యల్లో ఆరితేరింది శ్రద్ధ.పని పట్టాలెక్కడానికి అట్టే టైమ్‌ పట్టదు. కాన్సెప్ట్‌ డిస్కషన్‌ మీటింగ్‌ తరువాత పని పరుగులు తీస్తుంది. సాధారణంగా  పాపులర్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఒక ఫిక్స్‌డ్‌ స్టైల్‌కే పరిమితం అవుతారు. అది దాటి బయటికి రావడాన్ని రిస్క్‌ అనుకుంటారు. అయితే ఎప్పటికప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ  ‘ఫిక్స్‌డ్‌ స్టైల్‌’ అనేది లేకుండా జాగ్రత్త పడింది శ్రద్ధ. 

రేడియా జాకీ, డ్యాన్స్‌ షో హోస్ట్, కమెడియన్, రైటర్, అయిదు లక్షల ఫాలోవర్‌లు ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ కంటెంట్‌ క్రియేటర్‌... ఇలా శ్రద్ధా జైన్‌ సృజనాత్మక రూ΄ాలు ఎన్నో ఉన్నాయి. ‘డాక్టర్‌ జీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది. ‘నా నటన, రచనలకు సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు ద్వారా ఏదైనా సౌత్‌ ఫిల్మ్‌లో నటించే అవకాశం వస్తుంది అనుకున్నాను. అయితే ఏకంగా బాలీవుడ్‌ నుంచే పిలుపు రావడం ఆనందంగా అనిపించింది’  అంటున్న శ్రద్ధ  పోస్ట్‌–గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్‌గా నటించింది. ‘పెర్ఫర్మర్, కంటెంట్‌ క్రియేటర్‌లకు ఇది మంచి టైమ్‌. ఏమాత్రం టాలెంట్‌ ఉన్నా మన స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది’ అంటుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement