చీటికిమాటికి మర్చిపోతున్నారా? మతిమరుపు నుంచి ఎలా బయటపడాలి? | Natural Ways to Improve Your Memory Here Are The Tips | Sakshi
Sakshi News home page

చీటికిమాటికి మర్చిపోతున్నారా? మతిమరుపు నుంచి ఎలా బయటపడాలి?

Published Sat, Dec 9 2023 10:43 AM | Last Updated on Sat, Dec 9 2023 10:53 AM

Natural Ways to Improve Your Memory Here Are The Tips - Sakshi

మతిమరుపు.. దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో దీని బారిన పడుతూనే ఉంటాం. అప్పుడే పెట్టిన వస్తువులను కాసేపట్లోనే మర్చిపోవడం, మళ్లీ వెంటనే గుర్తుకురావడం మామూలే. అయితే మతిమరుపు రెండు రకాలుగా ర్పడుతుంది. మొదటి రకం ఫిజికల్‌ డ్వామెజ్ ద్వారా, రెండవది మెంటల్‌ డ్యామేజ్ ద్వారా ఏర్పడేది.

దీంట్లో మొదటిరకం నివారణకు మెడిసిన్స్‌ వాడాల్సిందే. కొందరికి పుట్టుకతోనే మతిమరుపు ఉంటుంది. ఇక రెండో రకంలో.. మెడిటేషన్‌ ద్వారా జ్ఞాపకశక్తిని తిరిగి పొందవచ్చు. అదెలాగో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్‌ నవీన్‌ నడిమింటి మాటల్లోనే..


 ఇవి పాటిస్తే కంట్రోల్‌లో ఉండే ఛాన్స్‌

  • ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం చెయ్యడం.
  • మెదడును యాక్టివ్‌గా ఉంచుకోవడం. అంటే మెదడుకు మేత పెట్టే పజిల్స్,సుడోకు లాంటివి రోజూ సాధన చేస్తూ ఉండటం.
  • మెమరీకి సంబంధించిన ఆటలు ఏదైనా ఆడుతూ ఉండటం. ఉదాహరణకు ఎవరినైనా కొన్ని వస్తువులు ఒక గదిలో పెట్టమని, వాటిని మీరు ఒక నిమిషం పాటు చూసి బయటకు వచ్చి, ఏమేం చూసి వచ్చారో అన్నీ గుర్తు చేసుకుని చెప్పడం, రాయడం. ఇది పిల్లల్లో కూడా జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఆడించవచ్చు. 
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అన్నింటికీ మంచిది.
  • నలుగురితో ఉల్లాసంగా గడపడం. దీనివల్ల నిద్రాణమైన జ్ఞాపకాలు బయటికి వచ్చి జ్ఞాపకశక్తి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
  • ఇంట్లో మీరు వాడే వస్తువులను క్రమపద్ధతిలో ఉంచుకోవడం వల్ల, ఏది ఎక్కడ ఉంటుందో సులభంగా గుర్తుంటుంది. ఉదాహరణకు మీ కళ్ళజోడు ఎప్పుడూ బెడ్ పక్కనే చిన్న టేబుల్ మీద ఉంచే అలవాటు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కనబడనప్పుడు నేరుగా అక్కడికే వెళ్ళి వెతకచ్చు, ఇంట్లోవాళ్ళెవరైనా ఆ చోటు మార్చేస్తే తప్ప.
  • మంచి నిద్ర కేవలం మతిమరుపు నివారించడానికే కాదు, ఆరోగ్యానికి కూడా అవసరం. మంచి నిద్రలో మెదడు సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తుంది. మరిచిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement