వాట్‌ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ.. Mount Erebus Volcano In Antarctica Emitting Gold Dust | Sakshi
Sakshi News home page

వాట్‌ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..

Published Sun, May 19 2024 3:13 PM | Last Updated on Sun, May 19 2024 4:59 PM

Mount Erebus Volcano In Antarctica Emitting Gold Dust

అంటర్కాటికాలో ఉన్న ‘మౌంట్‌ ఎరిబస్‌’ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అగ్నిపర్వతం. ఇది బంగారు ధూళిని ఎగజిమ్ముతోంది. ఈ అగ్నిపర్వతం సముద్ర మట్టానికి 12,448 అడుగుల ఎత్తున ఉంది. ఇది ప్రతిరోజూ ఎగజిమ్మే ధూళిలో దాదాపు 80 గ్రాముల వరకు బంగారు ఉంటోంది. దక్షిణధ్రువ ప్రాంతంలో మంచుతో నిండి ఉన్న ఈ అగ్నిపర్వతాన్ని తొలిసారిగా 1841లో బ్రిటిష్‌ నావికాదళం అధికారి జేమ్స్‌ క్లార్క్‌ రాస్‌ కనుగొన్నాడు.

అంటార్కిటికాలో 138 అగ్నిపర్వతాలు ఉన్నా, వాటిలో ఎరిబస్, డిసెప్షన్‌ ఐలండ్‌ అగ్నిపర్వతాలు మాత్రమే క్రియాశీలమైనవి. తొలిసారి గుర్తించే నాటికి ఎరిబస్‌ అగ్నిపర్వతం నిద్రాణంగానే ఉన్నా, 1972 నుంచి ఇది పొగను, ధూళిని ఎగజిమ్ముతూ క్రియాశీలంగా మారింది.

ఈ అగ్నిపర్వతం అడుగున దాదాపు వెయ్యి డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో వెలువడే వాయువులు పైకి ఎగజిమ్మేటప్పుడు వెలువడే ధూళితో పాటు అడుగున ఉన్న బంగారం కూడా కరిగి బయటకు వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అగ్నిపర్వతాల నుంచి వెలువడే ధూళిలో బంగారం బయటపడటం చాలా అరుదని కొలంబియా యూనివర్సిటీలోని లామెంట్‌–డోహర్తీ ఎర్త్‌ అబ్జర్వేటరీ శాస్త్రవేత్త కోనర్‌ బేకన్‌ చెబుతున్నారు.  

(చదవండి: మిణుగురుల్లా మిలమిలలాడే పూల మొక్కలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement