ఆ విమానంలో ఇద్దరే ప్రయాణికులు! అదికూడా.. Mother And Daughter Only Passengers On Emirates Flight | Sakshi
Sakshi News home page

ఆ విమానంలో వెళ్తున్న మహిళలు ఆ ఇద్దరే ! ఊహకందని సర్‌ప్రైజ్‌!

Published Wed, Jan 10 2024 1:18 PM | Last Updated on Wed, Jan 10 2024 1:35 PM

Mother And Daughter Only Passengers On Emirates Flight - Sakshi

విమానంలో వెళ్తున్నప్పుడూ మనం మాత్రమే ఉండి మిగతా ప్రయాణికులు లేకపోతే ఆశ్చర్యంగా ఉంటుంది కదు. అందులోనూ విమానంలో అలా జరిగితే మాములుగా అనిపించదు. అదికూడా కేవలం మన కోసమే ఏదో కారు బుక్‌ చేసుకున్నట్లు విమానంలో వెళ్తున్నామా! అనిపిస్తుంది. అదికూడా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడే తెలిస్తే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది కదా! అలాంటి ఘటనే ఇక్కడ స్విట్జర్లాండ్‌కు వెళ్తున్న ఎమిరేట్స్‌ విమానంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..సీషెల్స్‌ నుంచి స్విట్జర్లాండ్‌కి వెళ్తున్న ఎమిరేట్స్‌ మిమానంలో ఇద్దరే ప్రయాణికులు. 25 ఏళ్ల జో డోయల్‌, ఆమె తల్లి 59 ఏళ్ల కిమ్మీ చెడెల్‌ మాత్రమే ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వారిద్దరు ఎకనామీ క్లాస్‌ క్యాబిన్‌లో ఉన్నారు. ఫ్లైట్‌ జర్నీ చేసేంతవరకు తామిద్దరమే ప్రయాణికులని వారివురికి తెలియదు. దీంతో ఒక్కసారిగా ఆ తల్లికూతుళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

అయితే బిజినెస్‌ క్లాస్‌లో నలుగురు ప్రయాణికులు ఉన్నారు గానీ వాళ్లు ప్రయాణిస్తున్న ఎకనామీ క్లాస్‌లో మాత్రం లేరు. తాము మాత్రమే ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నామని తెలిసి ఆనందంగా ఆ విమానంలో ఉన్న ఫ్లైట్‌ అటెండెంట్‌లతో చాట్‌ చేస్తూ గడిపామని టిక్‌టాక్‌లో వెల్లడించింది జో డోయల్‌. "ఈ రోజు ఎమిరేట్స్‌ విమానంలో ఎగురుతున్న ఏకైక మహిళలు మేమే" అని క్యాప్షన్‌ పెట్టి మరీ వీడియో పోస్ట్‌ చేసింది. బహుశా క్రిస్మస్‌టైం, పైగా సీషెల్స్‌లో వర్షాకాలం కావడంతో ప్రయాణికులు లేరని చెప్పుకొచ్చింది. ఇద్దరే విమానంలో ప్రయాణించడం చాలా ఆనందంగా ఉందని రాసింది. ఇలాంటి ఘటన జరగడం తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు రెండు జరిగాయి. వారు కూడా ఇలానే సంబరపడ్డారు. పైగా ఏదో ప్రైవేట్‌ జెట్‌లో ప్రయాణిస్తున్న ఫీల్‌ కలిగిందని వారు చెప్పుకొచ్చారు కూడా. 

(చదవండి: మిసెస్‌ ఇండియాగా 55 ఏళ్ల మహిళ! గెలుపుకి ఏజ్‌తో పనిలేదని ప్రూవ్‌ చేసింది!)

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement