వర్షాకాలంలో ఈ పప్పు ధాన్యాలు తింటున్నారా..? | Monsoon Diet: Pulses To Avoid During Rainy Season | Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో ఈ పప్పు ధాన్యాలు తింటున్నారా..?

Published Sun, Jul 14 2024 8:05 AM | Last Updated on Sun, Jul 14 2024 8:05 AM

Monsoon Diet: Pulses To Avoid During Rainy Season

సూర్యుడి భగభగలు నుంచి చల్లటి తొలకరి చినుకులతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఇక ఎప్పుడు ముసురుపట్టి వర్షం పడుతుందో తెలియక ఇబ్బందులు పడుతుంటాం. ఓ పక్క వంటిట్లో వస్తువులు నిల్వ చేసుకోవడం కష్టమంటే, మరోవైపు వర్షాలకు బ్యాక్టీరయి, వైరస్‌లతో సీజనల్‌ ఫ్లూ జ్వరాలు ఊపందుకుంటాయి. ఇలాంటి వర్షాకాలంలో అందుకు తగ్గట్టు మనం తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే పలు రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా పప్పుధాన్యాలు ఆరోగ్యానికి మంచిదని తినేస్తుంటాం. కానీ ఈ వర్షాకాలంలో ఇలాంటివి అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కారణాలేంటో సవివరంగా చూద్దాం. 

పప్పుధాన్యాలు ఆరోగ్యకరమైనవే అయినా వర్షాకాలంలో మాత్రం ఇలాంటి పప్పులకు దూరంగానే ఉండాలి. ఎందకంటే వాతావరణంలోని తేమ శరీరంలోని జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గ్యాస్‌, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బీన్స్‌, కాయధాన్యాలు, చిక్‌పీస్‌, బఠానీలు వంటి పప్పుధాన్యాలకు దూరంగా ఉండాలి. 

సెనగపప్పు..
సెనగపప్పులో ప్రోటీన్‌, ఫైబర్‌, మినరల్స్‌ ఉంటాయి. ఇవి అజీర్ణం, అపానవాయువుకి దారితీస్తుంది. సెనగపప్పు బరువు నిర్వహణలో, కొలస్ట్రాల్‌ను నియంత్రించడం తోపాటు మొత్తం జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. 

మసూర్‌ పప్పు లేదా ఎర్ర పప్పు
వాటిలో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు సీ, బీలు ఉన్నాయి. అయినప్పటికీ దీనిలో ఉండే రాఫినోస్, స్టాకియోస్ వంటి చక్కెరలు జీర్ణం కావడం కష్టమవ్వడం వల్ల ఇది అపానవాయువుకు కారణమవుతుంది.

మినపప్పు..
ఎముకల ఆరోగ్యానికి మద్దతునిస్తుంది, శక్తిని పెంచుతుంది. ఇది పొట్టపై భారంగా ఉంటుంది. జీర్ణంమవడం కష్టమవుతుంది. ఇది తేమతో కూడిన వాతావరణంలో అసౌకర్యం, ఉబ్బరానికి దారితీస్తుంది.
తినకూడని ఇతర ఆహారపదార్థాలు..

వేయించిన ఆహారాలు..
వర్షాకాలంలో రోజూ వేయించిన ఆహారాన్ని తినకుండా ఉండటం చాలా అవసరం. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆ ఒత్తిడి కాలేయంపై ఏర్పడుతుంది. 

పచ్చి ఆకుకూరలు..
సలాడ్‌లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఈ కాలంలో వాటిని నివారించడం ఉత్తమం. ఆకుల్లో తరుచుగా వ్యాధికారక కీటకాలు ఉంటాయి. వాటిని తొలగించడం కష్టం. అందువల్ల వాటిని బాగా శుభ్రం చేసుకుని తినడం లేదా దూరంగా ఉండటం మంచిది. 

(చదవండి:

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement