Malabar Spinach: బచ్చలి ఆరోగ్యానికే కాదు, అందానికి నెచ్చెలి కూడా Malabar Spinach check these amazing Health Benefits | Sakshi
Sakshi News home page

Malabar Spinach: బచ్చలి ఆరోగ్యానికే కాదు, అందానికి నెచ్చెలి కూడా

Published Thu, Jun 13 2024 3:15 PM

Malabar Spinach check these  amazing Health Benefits

మన తీసుకునే ఆహారంలో ప్రధానమైనవి ఆకుకూరలు. ఆకుకూరలు అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఆకుకూరలతో అటు ఆరోగ్యాన్ని ఇటు సౌందర్యాన్ని కూడా  సొంతం చేసు కోవచ్చు.  అలాంటి ఆకుకూరల్లో ఒకటి బచ్చలి కూర. వీటిల్లో తీగ బచ్చలి, చెట్టు బచ్చలి, ఎర్ర బచ్చలి లాంటి రకాలు ఉన్నాయి.  

బచ్చలికూరను శాస్త్రీయంగా బసెల్లా ఆల్బా అని పిలుస్తారు.  ఇంకా మలబార్ బచ్చలికూర, భారతీయ బచ్చలికూర, సిలోన్ బచ్చలికూర, ఈస్ట్-ఇండియన్ బచ్చలికూర, వైన్ బచ్చలికూర, క్లైంబింగ్ బచ్చలికూర, చైనీస్ బచ్చలి, సైక్లోన్ బచ్చలి, అలుగ్బాటి అని కూడా పిలుస్తారు. కాల్షియం, విటమిన్ ఎ, మెగ్నీషియం, ప్రోటీన్‌లతో పాటు ఐరన్‌కి అద్భుతమైన మూలం. ఇందులో ఫోలేట్, విటమిన్ బి6, రిబోఫ్లావిన్ వంటి బి-కాంప్లెక్స్ విటమిన్‌లతో పాటు ఫాస్పరస్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి.  తాజా ఆకుల్లో లుటిన్ , జియాక్సంతిన్ వంటి అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. 

బచ్చలికూరలోని ఐరన్ రక్త వృద్ధికి తోడ్పడుతుంది. విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయ పడతాయి.  బచ్చలి కూరతో శరీరంలో వేడి తగ్గుతుంది.  చలవ చేస్తుందని పెద్దలు చెబుతారు. గుండె ,మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి ఎముకలు బలంగా మారుతాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి

బచ్చలికూరలో విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ముఖంపై మచ్చలను, మలినాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. బచ్చలికూరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్ రెండూ ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడతాయి.

 

Advertisement
 
Advertisement
 
Advertisement