చపాతీతో క్రిస్పీ రోల్స్‌.. వెరైటీగా చేసుకోండిలా | How To Make Crispy Rolls With Chapathi Recipe In Telugu | Sakshi
Sakshi News home page

చపాతీతో క్రిస్పీ రోల్స్‌.. వెరైటీగా చేసుకోండిలా

Published Fri, Oct 13 2023 10:41 AM | Last Updated on Fri, Oct 13 2023 10:54 AM

How To Make Crispy Rolls With Chapathi Recipe In Telugu - Sakshi

క్రిస్పీ రోల్స్‌ తయారీకి కావల్సినవి:

చపాతీలు – మూడు ; కొత్తిమీర తరుగు – అరకప్పు ;
ఉడికించిన బంగాళ దుంపలు – రెండు; కారం – అరటీస్పూను;
ధనియాల పొడి – టీస్పూను; గరం మసాలా – రెండు టీస్పూన్లు ;
పచ్చిమిర్చి – రెండు; ఉల్లిపాయ – ఒకటి; చాట్‌ మసాలా – ఒకటిన్నర టీస్పూన్లు;
గోధుమ పిండి –అర కప్పు; బియ్యప్పిండి – స్పూను;
కార్న్‌ఫ్లోర్‌ – మూడు టీ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా


తయారీ విధానమిలా:
చపాతీలను సన్నగా పొడవుగా తరిగి, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమంపై కొద్దిగా నీళ్లుచల్లి మరోసారి కలపాలి ∙ఇప్పుడు మెత్తగా మారిన చపాతీ మిశ్రమంలో కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ∙ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా తరగాలి.

► బంగాళదుంపలు తొక్కతీసి చిదుముకోవాలి. దీనిలో ధనియాల పొడి, గరం మసాలా; పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, ఛాట్‌ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.

► ఇప్పుడు చేతులకు కొద్దిగా నూనె రాసుకుని దుంప మిశ్రమాన్ని రోల్స్‌గా చుట్టుకోవాలి  గోధుమపిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా కలపాలి ∙ఇప్పుడు దుంపరోల్స్‌ను గోధుమపిండిలో ముంచి, తరువాత చపాతీ మిశ్రమాన్ని రోల్‌కు అద్దాలి.

► ఇప్పుడు రోల్‌ను మరుగుతోన్న నూనెలో వేసి, గోల్డెన్‌ కలర్‌లోకి మారేంత వరకు వేయించి తీయాలి ∙ఇలా రోల్స్‌ అన్నింటిని వేయిస్తే క్రిస్పీ రోల్స్‌ రెడీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement