సమ్మర్‌లో చెరుకురసం తాగటం మంచిదేనా? అందరూ తాగొచ్చా..! Health Benefits of Sugarcane Juice But People With These Diseases | Sakshi
Sakshi News home page

చెరుకురసం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? కానీ వీళ్లు మాత్రం..

Published Wed, Mar 27 2024 1:03 PM | Last Updated on Wed, Mar 27 2024 1:34 PM

Health Benefits of Sugarcane Juice But People With These Diseases - Sakshi

వేసవి అనంగానే దాహం అంటూ ప్రజలు అల్లాడిపోతారు. ఈ కాలంలో ఘన పదార్థాల కంటే ద్రవపదార్థాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే అందరూ కూల్‌డ్రింక్‌లు వంటిపై ఆధారపడుతుంటారు. అయితే కూల్‌డ్రింక్‌లు తాగొద్దని సూచించడంతో అందరూ..కొబ్బరి బొండాలు, చెరుకు రసాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ వేసవిలో చెరుకు రసానికి మించిన పానీయం లేదని చెప్పొచ్చు. ఇది తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది.  పైగా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. అలాంటి ఈ చెరుకు రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అందరికీ ఇది మంచిదేనా? కాదా సవివరంగా తెలుసుకుందామా!.

నోరూరించే తియ్యటి చెరుకు రసాన్ని ఇష్టపడని వాళ్లు ఉండరు. అలాంటి చెరుకురసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది బరువును అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ప్రతిరోజు ఒక గ్లాసు చెరకురసం తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

ఎన్ని లాభలంటే..

  • క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువుగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు ఎక్కువుగా ఉన్నచెరకు రసం బాలింతలు తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది.
  • శరీరంలో అధిక బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను ఈ రసం తగ్గించగలదు. బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. 
  •  ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి ప్రతి రోజూ రెండు పూటలా తీసుకోవటం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
  •  ఈ చెరకు రసం పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది.
  • మూత్రపిండాలలో ఉన్న రాళ్ల సమస్యల్ని తొలగించడంలో చెరుకురసం ఎంతగానో దోహదపడుతుంది.
  • చెరకు రసం సహజమైన ఫ్రక్టోజ్‌ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిటెండ్లను, ప్రొటీన్లను సాల్యుబుల్‌ ఫైబర్‌ను కూడా ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. శరీరానికి పోషణను అందిస్తుంది.

వీళ్లు అస్సలు తాగొద్దు..

  • అయితే చెరకు రసాన్ని ఎట్టి పరిస్థితిలోనూ రోజూ తాగొద్దు. అది కూడా మోతాదుకు మించి అస్సలు తాగకూడాదు. పురుషులు రోజూ ఒక కప్పు, స్త్రీలు అయితే ముప్పావు కప్పు మోతాదులోనే చెరకు రసం తాగాలి. అంతకన్నా ఎక్కువ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి.
  • అధిక బరువుతో బాధపడుతున్నవారు చెరకు రసాన్ని తాగకపోవడం మంచింది. డైట్‌ పాటించే వారు చెరకు రసంకు దూరంగా ఉండాలి. రోజూ దీనిని తాగడంవ వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
  • డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు, 4 ఏళ్లకన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు, విటమిన్‌ సప్లిమెంట్లు వాడుతున్నవారు, రక్తాన్ని పలుచగా చేసే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నవారు చెరకు రసానికి దూరంగా ఉండాలి.
  • కొన్ని చోట్ల చెరకు రసం తీసే పద్దతి అపరిశుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈగలు వాలుతుంటాయి. అలాంటి చోట చెరకు రసం తాగకపోవడమే మంచింది. లేదంటే ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫుడ్‌ పాయిజనింగ్‌ బారిన పడే ప్రమాదం ఉంది.
  • జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, విరేచనాలతో బాధపడుతున్నవారు ఎట్టి పరిస్థితిలోనూ చెరకు రసం తాగొద్దు.
  • అలాగే ఒక్కోసారి ఇక ఆరోగ్య వంతులు కూడా చెరకు రసం రోజూ తాగడం అంత మంచిది కాదు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ జీవనశైలిలో దీన్ని భాగం చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత వైద్యులు, ఆరోగ్య నిపుణులను సం‍ప్రదించి పాటించటం ఉత్తమం. 

(చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌కి గేదెలను ఉపయోగిస్తారట!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement