సలాడ్స్‌ తయారీలో ఇబ్బందా..? ఇక స్లైస్‌ డివైస్‌తో క్లియర్‌..! Having Trouble To Cut Egg Slices. Here Is The Small Device For Egg Cutting | Sakshi
Sakshi News home page

సలాడ్స్‌ తయారీలో ఇబ్బందా..? ఇక స్లైస్‌ డివైస్‌తో క్లియర్‌..!

Published Sun, Mar 10 2024 12:32 PM | Last Updated on Sun, Mar 10 2024 12:32 PM

Having Trouble To Cut Egg Slices. Here Is The Small Device For Egg Cutting  - Sakshi

ఆరోగ్యాన్నిచ్చే ఆహారంలో సలాడ్స్‌ ముందువరుసలో ఉంటాయి. కానీ సలాడ్స్‌ను తయారు చేసుకోవడమంటేనే బద్ధకమా? అయితే వెంటనే ఈ స్లైస్‌ డివైస్‌ని తెచ్చుకోండి. ఏ పండునైనా ఒకే ఒక్క నిమిషంలో స్లైసెస్‌గా చేసిపెడుతుంది. ఉడికించిన గుడ్లు, యాపిల్, బనానా వంటి పండ్లనైతే ఒకేసారి ముక్కలుగా కట్‌ చేసుకోవచ్చు. అందుకు వీలుగా మధ్యలో ఒక వైపు మందంగా ఉండే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డివైడర్‌ స్టాండ్‌ అమర్చి ఉంటుంది. దాని సాయంతో పండ్లను ముక్కలుగా కట్‌ చేసుకోవచ్చు. మరోవైపు కూడా అదేమాదిరి మరో షేప్‌లో డివైడర్‌ ఉంటుంది. దీన్ని వినియోగించుకోవడం.. క్లీన్‌ చేసుకోవడం రెండూ సులభమే. కిచెన్‌లో చిన్న ప్లేస్‌లో కూడా దీన్ని సర్దొచ్చు. స్థలం పెద్దగా ఆక్రమించదు. దీని ధర 7 డాలర్లు (రూ.580).

ఇవి చదవండి: ఆటోమేటిక్‌ ప్రెజర్‌ సర్ఫేస్‌ మెషిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement