Happy New Year 2024: వెల్‌కమ్‌ పార్టీ | Happy New Year 2024: Get ready to decorate for New Year celebrations | Sakshi
Sakshi News home page

Happy New Year 2024: వెల్‌కమ్‌ పార్టీ

Published Sat, Dec 30 2023 12:32 AM | Last Updated on Sat, Dec 30 2023 12:32 AM

Happy New Year 2024: Get ready to decorate for New Year celebrations - Sakshi

2023 కి వీడ్కోలు, న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెప్పడానికి బంధు మిత్రులు బృందంగా ఒక చోట చేరుతుంటారు. ఏడాది మొత్తం జ్ఞాపకంగా మిగిలిపోయే ఈ రోజును ఇంట్లో ఉల్లాసభరితంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. న్యూ ఇయర్‌ వేడుకల అలంకరణలో మెరిసే, ఆకర్షణీయమైన వెలుగులతో ఈ రోజును అలంకరించడానికి చకచకా సిద్ధం అయిపోవచ్చు.

► బ్యానర్‌
ముందుగా ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ అని చూపే ఒక సాధారణ బ్యానర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నలుపు, బంగారం, వెండి రంగులు ఉండే బ్యానర్‌తో ఉన్న ఈ అలంకారం అందరిలోనూ ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ బ్యానర్‌ ను మీ ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు. దీనిని టేప్‌తో గోడలకు అతికించడం, ఆ తర్వాత తొలగించడం కూడా సులువే.

► బెలూన్స్‌
 నూతన సంవత్సర వేడుకల అలంకరణలో బెలూన్‌లు మరో ముఖ్యపాత్ర పోషిస్తాయి. పార్టీ మూడ్‌ను తీసుకురావడానికి ఇంట్లో బెలూన్‌ ఆర్చ్‌ని సృష్టించుకోవాలి. రెడీమేడ్‌గా కూడా ఈ ఆర్చ్‌లు దొరుకుతాయి. ఈ బెలూన్స్‌ కూడా బంగారం, తెలుపు, మెరిసే బెలూన్స్‌ మరింత పాజిటివ్‌ ఎనర్జీని కలిగిస్తాయి.

► కొవ్వొత్తులు
స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చున్నప్పుడు అక్కడి వాతావరణం హాయిగొలిపే అనుభూతిని ఇవ్వాలి. ఇందుకు ఫ్లేమ్‌లెస్, సెంటెడ్‌ క్యాండిల్స్‌ ఎంతగానో తోడ్పడతాయి. అందుకని, ముందుగానే వీటిని సిద్ధం చేసుకోవడం మంచిది. న్యూ ఇయర్‌లోకి అడుగిడే కొత్త సమయంలో ఈ కొవ్వొత్తుల వెలుగులు అందరిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపుతాయి.

► ఫన్‌ నెక్లెస్‌ లు
టేబుల్‌పై కొవ్వొత్తులు ఒకటే ఉంచితే సరిపోదు. ఆ టేబుల్‌పైన పరిచే రన్నర్‌ పై పూసల దండలను అమర్చడం, వేలాడదీయడం పండగ సంబరాన్ని తీసుకువస్తుంది. వీటిలో కూడా బంగారం, నలుపు, వెండి పూసల దండలను ఎంచుకోవడం మంచిది.

► డిస్కో థీమ్‌
కొత్తసంవత్సరం అంటేనే ఒక జోష్‌తో నడవాలనుకుంటారు. న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెప్పే సమయంలో డాన్స్‌ చేసే వీలుండేలా డిస్కో థీమ్‌ని అలంకరించుకోవాలి. ఇందుకు సియెర్రా వంటి కొన్ని డిస్కో బాల్స్‌ ఈ అలంకరణకు ఉపయోగించుకోవాలి.

► పిల్లల కోసం ప్రత్యేకం
పార్టీలో పిల్లలు ఉంటే వారి కోసం.. వారి చేత నియాన్, పేస్టెల్‌ బెలూన్‌లు, రంగురంగుల నాప్‌కిన్స్, కప్పులతో వారి పార్టీ ప్లేస్‌ను అలంకరించవచ్చు.

► తెల్ల బంగారం
తెలుపు, బంగారు రంగులతో పార్టీ ప్లేస్‌ను మెరిసేలా అలంకరించండి. ఇందుకు షిమ్మరీ గోల్డ్‌ ఫ్రింజ్‌ కర్టెన్లను జోడించే ముందు డోర్‌ ఫ్రేమ్‌ పై భాగంలో తెల్లటి బెలూన్‌లను బ్లో అప్‌ చేయచ్చు.

► స్ట్రింగ్‌ లైట్లు
బయటి వైపు స్ట్రింగ్‌ లైట్లను వేలాడదీసి, వాటిని మెరిసేలా చేయచ్చు. దీంతో బయటి వాతావరణం వెలుగులతో పండగ వాతావరణాన్ని నిండుగా కనిపంచేలా చేస్తుంది.

► పేపర్‌ ప్లేట్స్‌
రంగు రంగుల పేపర్‌ ప్లేట్లను వాల్‌ డెకార్‌గా మార్చుకోవచ్చు. గోడపైన ఉల్లాసాన్ని కలిగించే రంగులను ఆకర్షణీయంగా అలంకరించుకోవడానికి చవకైన, సరైన మార్గం అవుతుంది.

► రంగు రంగుల టిష్యూ
కొత్త కొత్త అలంకరణతో పార్టీ ప్లేస్‌ను ఉత్తేజంగా మార్చడానికి రంగురంగుల టిష్యూ పేపర్లు కూడా వాడచ్చు. పింక్, బ్లూ, వైట్‌ టిష్యూ పేపర్లను తీసుకొని, వాటిని ఒక్కొక్కటీ జోడిస్తూ దండలా అల్లుకోవాలి. దీనిని పార్టీ ప్లేస్‌లో వేలాడదీయాలి.

► టేబుల్‌ క్లాత్‌
పింక్‌ గ్లిటర్‌ టేబుల్‌ క్లాత్‌ పరిచి, దానిపైన బంగారు, స్టార్‌ మోటిఫ్‌లతో ఉల్లాసభరితమైన థీమ్‌ని తీసుకురావచ్చు. దీంతో డిన్నర్‌ చేసే టేబుల్‌ న్యూ ఇయర్‌ వేడుకలో మరింత ప్రత్యేకతను నింపుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement