వినాయక చవితి స్పెషల్‌: స్వీట్‌ సందేశ్‌ చేసుకోండి ఇలా | Ganesh Chaturthi special sweet sandesh Recipe In Telugu | Sakshi
Sakshi News home page

వినాయక చవితి స్పెషల్‌: స్వీట్‌ సందేశ్‌ చేసుకోండి ఇలా

Published Mon, Sep 18 2023 2:08 PM | Last Updated on Mon, Sep 18 2023 2:51 PM

Ganesh Chaturthi special sweet sandesh Recipe In Telugu - Sakshi

స్వీట్‌ సందేష్‌ ఇలా చేసుకోండి 

కావలసినవి: ఉడికించిన చిలగడ దుంప – పెద్దది ఒకటి; పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు;
జీడిపప్పు పొడి – పావు కప్పు; కొబ్బరి పాలు – అరకప్పు; పంచదార – అరకప్పు;
యాలకులపొడి – అరటీస్పూను; రోజ్‌ వాటర్‌ – టీస్పూను.

తయారీ:

  • చిలగడ దుంప తొక్క తీసి ఉండలు లేకుండా మెత్తగా చిదుముకోవాలి ∙చిదుముకున్న చిలగడ దుంప మిశ్రమంలో జీడిపప్పు పొడి వేసి కలపాలి.
  • పంచదారలో కొద్దిగా నీళ్లుపోసి సుగర్‌ సిరప్‌ను తయారు చేసుకోవాలి
  • ∙సిరప్‌ తయార య్యాక కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఉండాలి.
  • తీగ పాకం వచ్చినప్పుడు చిలగడదుంప మిశ్రమాన్ని వేసి కలపాలి ∙మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొబ్బరిపాలు వేయాలి 
  • ∙మధ్యలో కొబ్బరి పాలతో΄పాటు యాలకులపొడి, రోజ్‌వాటర్‌ వేసి కలుపుతూ మొత్తం కొబ్బరి పాలు అయిపోయేంత వరకు మగ్గనివ్వాలి ∙
  • దాదాపు ఇరవై నిమిషాల తరువాత ఈ మిశ్రమం దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్‌ ఆపేసేయాలి ∙
  • గోరువెచ్చగా ఉన్నప్పుడే మిశ్రమాన్ని చేతులతోగానీ, మౌల్డ్స్‌లోవేసి నచ్చిన ఆకారంలో వత్తుకుంటే స్వీట్‌ సందేష్‌ రెడీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement