ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు : కంపెనీ లైసెన్స్‌ రద్దు | FSSAI suspends licence of Fortune Dairy after human finger found in ice cream | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు : కంపెనీ లైసెన్స్‌ రద్దు

Published Mon, Jun 17 2024 12:10 PM

FSSAI suspends licence of Fortune Dairy after human finger found in ice cream


ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన కోన్‌ ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI)  స్పందించింది.  వివాదానికి కారణమైన  ఐస్‌క్రీమ్‌ తయారీదారు లైసెన్సును రద్దు చేసింది. దీనిపై దాఖలైన  ఫిర్యాదు  నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

 కేసులో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ,  ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అధికారులు శుక్రవారం  పుణేకు చెందిన ఐస్‌క్రీమ్‌ యూనిట్లను సందర్శించారు. నమూనాలను సేకరించారని అధికారులు తెలిపారు. అనంతరం ఫార్చ్యూన్ డెయిరీకి చెందిన యమ్మో కంపెనీ లైసెన్స్‌ను  రద్దు చేసినట్టు పూణే రీజియన్ ఎఫ్‌డిఎ జాయింట్ కమిషనర్ సురేష్ అన్నపురే తెలిపారు. దీనికి సంబంధించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక ఇంకా రాలేదని అధికారులు తెలిపారు.      

 ఇదీ చదవండి:  ఐస్‌క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్‌కు కక్కొచ్చినంత పనైంది!

తన సోదరి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన కోన్‌ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించిందంటూ ముంబైలోని మలద్‌ ప్రాంతానికి చెందిన  వైద్యుడు బ్రెండన్‌ ఫిర్రావ్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం కోన్‌ ఐస్‌క్రీమ్‌ తింటుండగా గట్టిగా ఏదో తగిలింది. వెంటనే అనుమానం రావడంతో దాన్ని పరిశీలించి చూడగా చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఇది చూసి షాకైన ఫిర్రావ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో కంపెనీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో మలద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆ ముక్కను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఫిర్రావ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ స్టోరీ  నెట్టింట్‌ హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే..

 

Advertisement
 
Advertisement
 
Advertisement