‘బట్‌’ అనే మాట ఉంది చూశారూ.. బహు కంత్రీది.. కానీ! Do you know But Is a Dangerous Word check what Psychologists says | Sakshi
Sakshi News home page

‘బట్‌’ అనే మాట ఉంది చూశారూ.. బహు కంత్రీది.. కానీ!

Published Wed, Jan 17 2024 1:39 PM | Last Updated on Wed, Jan 17 2024 3:25 PM

Do you know But Is a Dangerous Word check what Psychologists says - Sakshi

మనిషి మనసులోని భావాలను తెలుసుకోవడానికి భాషే మార్గం. ఆ భాషను సక్రమంగా, తెలివిగా ఉపయోగించేవాళ్లు, ఉపయోగించగలిగేవాళ్లు ఉన్నత స్థానాలకు చేరతారు. ఉపయోగించలేని వాళ్లు మామూలు మనుషులుగా మిగిలిపోతారు. భాషలో కొన్ని వేల, లక్షల పదాలుంటాయి. వాటిలో ఒక ప్రమాదకరమైన పదం ‘కానీ’. అదేంటీ... ‘కానీ’ అనే పదం ఎలా ప్రమాదకరం? అనే డౌట్ మీకు రావచ్చు. '  ఇంట్రస్టింగ్‌ కథనం  మీకోసం....
 

‘‘కానీ’’ ఒక కంత్రీ పదం.../ మీరు తెలివైనవారు, కానీ... 
    మీ డ్రెస్ బాగుంది, కానీ (but)...
   మీరు బాగా పాడుతున్నారు, కానీ (but)...
    మీ హెయిర్ స్టైల్ బాగుంది, కానీ (but)...
    ఒక ఫ్రెండ్ గా మీరంటే చాలా ఇష్టం... కానీ (but)...
    మీ సెన్స్ ఆఫ్ హ్యూమరంటే ఇష్టం.. కానీ (but)...
    చంపడం, చంపించడం తప్పే... కానీ (but)...
ఇలా ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు మీరెలా ఫీలవుతారు? ఆ సమయంలో మీ మనసులో ఏమనిపిస్తుంది?
ఈ విషయంపై మీరెప్పుడూ పెద్దగా ఆలోచించి ఉండరు. కానీ ఆ ‘కానీ’ అనే ఒక్క పదం ఆ వ్యక్తి ఇంటెన్షన్ ను పట్టిస్తుంది. అతను లేదా ఆమె నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పకనే చెప్పేస్తుంది. 
 
‘కానీ’ ఒక లాండ్ మైన్...
‘కానీ’' అనే పదం ఒక లాంగ్వేజ్ ల్యాండ్ మైన్ లాంటిది. ఎందుకంటే... ఈ పదం దానికి ముందు ఉన్న వాక్యాన్ని తిరస్కరిస్తుంది. ఆ వాక్యంలో అతి ముఖ్యమైన విషయం ఆ తర్వాత వస్తుందనీ, దాన్ని అంగీకరించాలనీ చెప్తుంది.

ఉదాహరణకు... ‘మీ డ్రెస్ బాగుంది, కానీ రెడ్ అయితే ఇంకా బాగుండేది..’’ అని ఎవరైనా చెప్పారంటే, మీ మనసు డ్రెస్ బాగుందనే విషయాన్ని తిరస్కరిస్తుంది, రెడ్ అయితే బాగుంటుందనే విషయాన్నే అంగీకరిస్తుంది. అంటే... మీ డ్రెస్ బాగుంది అని చెప్పడం అబద్ధమన్నమాట. ఆ మాట చెప్పలేక, బాగుందని చెప్పి, 'కానీ' అని సన్నాయి నొక్కులు నొక్కుతారన్నమాట. అలా తమకు కావాల్సిన, తమకు నచ్చిన అభిప్రాయాన్ని మీ మనసుపై రుద్దుతారన్నమాట. మీరు, మీ మనసు ఆ మోసాన్ని గ్రహించలేరు. అలా 'కానీ' అనే ఈ చిన్న పదం దుర్వినియోగమవుతుంది. 

ఎవరెలా వాడతారంటే... 
అనుభవజ్ఞులైన కార్పొరేట్ మేనేజర్లు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చినప్పటికీ, ఆపై 'కానీ' జోడించడం ద్వారా ప్రభావాన్ని దెబ్బతీస్తారు.
♦     మొత్తం మీద మీ పనితీరు బాగుంది, కానీ మీరు టైం పాటించాలి. 
♦     మీరు ఆ ప్రాజెక్ట్ బాగా హేండిల్ చేశారు, కానీ కొంచెం స్పీడ్ పెంచాలి. 

కపుల్స్ తమ జీవిత భాగస్వాములను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పి, ఆపై 'కానీ' అనడంతో మొత్తం నాశనం చేస్తారు.
♦      ఇలా నీతో ఉండటం చాలా బాగుంది, కానీ నువ్వు శుభ్రంగా కనిపించాలి. 
♦     నువ్వన్నా, నీ మాటలన్నా నాకు చాలా ఇష్టం, కానీ చాలా ఎక్కువ మాట్లాడతావు. 

తల్లిదండ్రులు వారి 'BUTs' ను నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల పిల్లల్లో ప్రతికూల స్పందనల్ని ప్రేరేపిస్తారు.
♦      నీ చేతిరాత బాగుంది, కానీ ఇంకా మార్కులు రావాలి. 
♦      నీ స్పెల్లింగ్ బాగుంది, కానీ చేతిరాత బాగోలేదు. 
ఇలా వారు మెచ్చుకుంటున్నా, ‘కానీ’ మొత్తం అర్థాన్ని మార్చేస్తుంది. మీ మనసు ఆ 'కానీ..' ముందు ఉన్న ప్రశంసను తిరస్కరించి, దాని తర్వాత ఉన్న నెగెటివ్ నే స్వీకరిస్తుంది. 'అయితే' అనే పదం కూడా దాదాపు ఇలాంటి ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తుంది. 

మరేం చెయ్యాలి?
'కానీ'ని 'అలాగే' అనే పదంతో భర్తీ చేయండి! ఇలా ఒక వారం రోజులు మీరు ప్రయత్నిస్తే... 'కానీ' బారినుంచి తప్పించుకోవచ్చు.
♦      ‘‘ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, కానీ మీరు టీమ్ తో కలిసిపోవాలని కోరుకుంటున్నాను...’’ అనే వాక్యానికి బదులుగా ‘‘ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, అలాగే మీరు టీమ్ తో కలిసిపోవాలని ఉండాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పండి. 
♦     ‘‘మీరు చెప్పే చాలా విషయాలతో అంగీకరిస్తున్నాను, కానీ ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించమని కోరుతున్నా’’ అని చెప్పడానికి బదులుగా ‘‘మీరు చెప్పే చాలా విషయాలతో అంగీకరిస్తున్నాను, అలాగే ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించమని కోరుతున్నా’’ అని చెప్పండి. 
అయితే ఈ 'అలాగే' వాడకంతో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు దీన్ని ఎక్కువగా నొక్కిచెప్పినా, దానిని ఉపయోగించటానికి ముందు, తరువాత పాజ్ చేసినా, ఇది 'కానీ'లాంటి దుష్ప్రభావాన్నే చూపిస్తుంది. 

‘కానీ’ ఉపయోగించాల్సిన పద్ధతి
వాస్తవానికి, 'కానీ' అనే పదం ఎదుటి వ్యక్తి ఆలోచనను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటే దాన్ని ఉపయోగించడంలో తప్పేమీ లేదు. అందువల్ల నెగెటివ్ విషయం స్థానంలో పాజిటివ్ ప్రత్యామ్నాయాన్ని నొక్కి చెప్పేటప్పుడు ఉపయోగించండి. ఉదాహరణకు...
♦    ‘‘మనం ఈ ప్రాజెక్టులో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నాము, కానీ మనం విజయం సాధించగలమని నాకు తెలుసు.’’
♦    ‘‘మనం పూర్తిగా ఫెయిలయ్యాం, కానీ మన తప్పుల నుండి నేర్చుకొని ముందుకు సాగాలి.’’ ఇలా చెప్పినప్పుడు మనసు ఆ వాక్యాల్లోని మొదటి భాగాన్నిన తిరస్కరించి, ‘కానీ’ తర్వాతి భాగాన్ని స్వీకరిస్తుంది. మీరు చెప్పాలనుకున్నది నేరుగా వారి మనసును చేరుతుంది. 

కాబట్టి మీ 'కానీ' ఎక్కడుందో, ఎలా ఉపయోగిస్తున్నారో గమనించుకోండి. 'కానీ' ఉపయోగం గురించి బాగా తెలుసుకోవడం ద్వారా, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా, 'అలాగే' తో భర్తీ చేయడం ద్వారా మీరు కోరుకున్న ఫలితాలు సాధించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. 

-సైకాలజిస్ట్ విశేష్
8019 000066
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement