Darshana Banik: తను ఒక 'దర్శనా'త్మకం.. Darshana Banik: An Indian Model And Actress Life Story | Sakshi
Sakshi News home page

Darshana Banik: తను ఒక 'దర్శనా'త్మకం..

Published Sun, Apr 14 2024 7:51 AM | Last Updated on Sun, Apr 14 2024 8:29 AM

Darshana Banik: Is An Indian Model And Actress Life Story - Sakshi

‘సేవ్‌ ద టైగర్స్‌’.. సింప్లీ సూపర్బ్‌ అనిపించుకుంటున్న వెబ్‌ సిరీస్‌! అందులో ‘హారిక’ రోల్‌లో కనిపించిన నటి.. దర్శనా బనిక్‌. కూల్‌ లుక్స్‌.. గుడ్‌ యాక్టింగ్‌ స్కిల్స్‌తో ఆమె కూడా సింప్లీ సూపర్బ్‌ అని వీక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌తో లైమ్‌లైట్‌లో ఉన్న దర్శనా గురించి క్లుప్తంగా..

  • పుట్టి, పెరిగింది కోల్‌కత్తాలో. రబీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. డిగ్రీ ఫైనలియర్‌లో ఉన్నప్పుడే అందాల పోటీల్లో పాల్గొంది.
  • అందాల పోటీల్లో పార్టిసిపేషన్‌ ఆమెకు మోడలింగ్‌ అవకాశాలను తెచ్చిపెట్టింది. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే బొరోలిన్, వొడాఫోన్, కలర్స్, పీసీ చంద్ర జ్యూలర్స్‌ వంటివాటికి మోడల్‌గా పనిచేసింది.
  • మోడలింగ్‌లో ఉన్న చాలామందిని వరించినట్టే..  దర్శనా దరికీ సినిమా చాన్స్‌లు వరుస కట్టాయి. అలా 2018లో ‘అశ్చే అబర్‌ షబోర్‌’తో బెంగాలీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
  • దర్శనా.. బెంగాలీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే టాలీవుడ్‌ దృష్టిలో పడింది. ‘ఆటగాళ్లు’తో తెలుగు ఫ్యాన్‌ బేస్‌ని క్రియేట్‌ చేసుకుంది. ‘బ్లాక్‌’ అనే మరో సినిమాలోనూ కనిపించింది.
  • బాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ నటనావకాశాలు క్యూకట్టాయి. ‘ఎజ్రా’ అనే హిందీ మూవీలో, ‘యారుక్కుమ్‌ అంజేల్‌’ అనే తమిళ చిత్రంలో నటించింది.
  • వెబ్‌స్క్రీన్‌ కూడా దర్శనాకు వెల్‌కమ్‌ చెప్పింది. ఆమె నటించిన ‘సేవ్‌ ద టైగర్స్‌’ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. 

ఫిల్మ్‌ ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధంలేని వాళ్లు ఈ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవడం అంత ఈజీకాదు. అందులోనూ ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లడాలు, పార్టీలకు అటెండ్‌ అవడాలు వంటి సోషల్‌ మూవింగ్‌ లక్షణాలేవీ లేని నాలాంటి వాళ్లకు మరీ కష్టం. అయినా ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చానంటే  నేను చేసిన.. చేస్తున్న పనే కారణం. అందుకే మన పనే మనకు అవకాశాలను తెచ్చిపెడుతుందని నమ్ముతాను! – దర్శనా బనిక్‌

ఇవి చదవండి: ఎందెందు వెదికినా కరివేపాక్‌ కలదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement