కూల్‌డ్రింక్స్‌ తాగితే.. శరీరం చల్లబడుతుందా? Cool Drinks Effects On Damage Of Tooth Enamel | Sakshi
Sakshi News home page

కూల్‌డ్రింక్స్‌ తాగితే.. శరీరం చల్లబడుతుందా?

Published Sun, Feb 28 2021 2:31 PM | Last Updated on Sun, Feb 28 2021 2:31 PM

Cool Drinks Effects On Damage Of Tooth Enamel - Sakshi

చల్లని పానీయాలు వేసవిలో మంచి ఉపశమనం కలగజేస్తాయనే అపోహతో మనం కూల్‌డ్రింక్స్‌ తాగుతుంటాం. వాటిని తాగగానే దాహం తీరుతుందనే దురభిప్రాయంతో చాలామంది నీటికి బదులుగా తాగేస్తుంటారు. కానీ వాటిని తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాల్లో రుజువైంది. పిల్లల్లో వీటి వల్ల ఊబకాయం వస్తుంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్‌ వచ్చే రిస్క్‌ కూడా ఉంది.

కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ దంతాలపై ఉండే అనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫారిక్‌ యాసిడ్‌తో క్యాల్షియం మెటబాలిజమ్‌ సైతం దెబ్బతిని, ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయనే పరిశోధనల నివేదికలు ఉన్నాయి. పైగా కూల్‌డ్రింక్స్‌ను నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాలు (ప్రిజర్వేటివ్స్‌) వల్ల పిల్లల్లో విపరీత ధోరణులు పెరిగి మానసిక అనారోగ్యాలకు దారితీస్తుందని తెలిసింది.

చదవండి: నాకు ఫిట్స్‌, ప్రయత్నిస్తే సమస్యలొస్తాయా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement