మాస్కా మజాకా.. ఈ కార్టూన్‌ చూడండి.. భాష అక్కర్లేదు.. | Cartoon That Brought Recognition To The Iranian Cartoonist Ayat Naderi | Sakshi
Sakshi News home page

మాస్కా మజాకా.. ఈ కార్టూన్‌ చూడండి.. భాష అక్కర్లేదు..

Published Fri, Feb 11 2022 6:08 PM | Last Updated on Fri, Feb 11 2022 7:58 PM

Cartoon That Brought Recognition To The Iranian Cartoonist Ayat Naderi - Sakshi

ఇరాన్‌ కార్టూనిస్ట్‌ ఆయత్‌ నదేరి యానిమేటర్, యానిమేషన్‌ డైరెక్టర్‌ కూడా. ఇదంతా ఒక ఎత్తయితే టీచర్‌గా ఆయత్‌కు మంచి పేరు ఉంది. ఇస్‌ఫాహన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ది ఆర్ట్స్‌లో ఆయన చెప్పే పాఠాలు ఎన్నో కుంచెలకు పదును పెట్టాయి. క్యారికేచర్‌ గ్రామ్, తాష్‌ ఆర్ట్‌ అకాడమీ వ్యవస్థాపకుడైన ఆయత్‌కు కార్టూన్‌ ఐడియాలు ఎలా వస్తాయి?

చదవండి: ఇదో చెత్త ప్రశ‍్న.. ఇంటర్వ్యూలో యువతి షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్

‘ప్రయాణంలో’ అని చెబుతారు ఆయన. ఆయత్‌కు నచ్చిన ఇరాన్‌ కార్టూనిస్ట్‌ మాసూద్‌. ఏడు సోలో ఎగ్జిబిషన్స్‌ చేసిన ఆయత్‌ ఎన్నో అవార్డ్‌లు అందుకున్నాడు. తన తొలి కార్టూన్‌ ‘పర్యావరణం’ అనే అంశంపై వేశాడు. అది తనకు బాగా గుర్తింపు తీసుకొచ్చింది. తాజాగా వేసిన ఈ కార్టూన్‌ చూడండి. భాష అక్కర్లేదు. ప్రపంచంలో ఏ మూలకు తీసుకువెళ్లినా అర్ధమవుతుంది. కరోనాకు మాస్కే మందు, మాస్కే తిరుగులేని ఆయుధం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement