ఆపిల్ సైడర్ వెనిగర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్‌! | Apple Cider Vinegar Usages, Side Effects And How To Use It Safely, Details Inside - Sakshi
Sakshi News home page

Apple Cider Vinegar Side Effects: ఆపిల్ సైడర్ వెనిగర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్‌! 

Published Tue, Mar 26 2024 3:14 PM | Last Updated on Tue, Mar 26 2024 4:13 PM

apple cider Viegar usages and side effects details inside - Sakshi

బరువు  తగ్గడం నుంచి చర్మం, జుట్టు సంరక్షణ దాకా  ఆపిల్ సైడర్ వెనిగర్ ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి.  విటమిన్లు, మినరల్స్  పుష్కలంగా ఉంటాయి.  పచ్చళ్లు, మెరినేడ్స్‌ లాంటి వాటిల్లో కూడా విరివిగా వాడతారు. అయితే దీనిని  తరచుగా ఉపయోగించడం మంచిదేనా? దీనివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా  ఉన్నాయా? 

ఆపిల్ సైడర్ వెనిగర్(ACV) ఆపిల్ జ్యూస్ ఈస్ట్‌తో కలిపి పులియబెట్టి తయారు చేస్తారు. ఎక్కువగా డ్రెస్సింగ్, మెరినేడ్స్, పచ్చళ్ళలో వాడతారు.  యాపిల్ సైడర్ వెనిగర్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తారు.అయితే  ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల దుష్ర్పభావాలు కూడా ఉన్నాయి. 

ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై దద్దుర్లు, చికాకు కలుగుతాయి. అందుకే దీని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.

ఈస్ట్ ఆపిల్‌లోని చక్కెరను ఆల్కహాల్‌గా మారుస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి సమస్యలొస్తాయి. అలాగే గ్యాస్ట్రోపరేసిస్‌తో  బాధపడేవారిలో  కడుపులోని నరాలు సరిగ్గా పనిచేయవు.

గ్యాస్ట్రోపరేసిస్ (గుండెల్లో మంట, ఉబ్బరం వికారం) లక్షణాలు, టైప్-1డయాబెటీస్, ఇన్సులిన్‌ తీసుకునేవారిలో  జీర్ణం ఆలస్యమవుతుంది కొన్ని మూత్రవిసర్జన మందులు, మధుమేహం మందులు, డిగోక్సిన్ ఇన్సులిన్-స్టిమ్యులేటింగ్ మందులు వాడేవారికి ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌తో రియాక్షన్‌ రావచ్చు. 

సుదీర్ఘ కాలం పాటు దీన్ని తీసుకుంటే  బ్లడ్‌లో పొటాషియం స్థాయిలు ప్రభావితవుతాయి.  తద్వారా  ఎముకల బలహీనత రావచ్చు. దీంట్లోని  ఎసిడిక్‌  యాసిడ్‌ మూలంగా పళ్ల ఎనామిల్‌ పాడయ్యే అవకాశం.  పిల్లల్లో గొంతుమంట వచ్చే అవకాశం. తలపై ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా సమస్యలు వస్తాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్( తరచుగా వాడటం వల్ల నల్లటి జుట్టు వాడిపోతుంది స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ పెరగవచ్చు.  ఈ నేపథ్యంలో చర్మం లేదా జుట్టుకు వాడేటపుడు మోతాదు నియంత్రణ పాటించాలి.  ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ కంటే ఎక్కువ ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించ కూడదు. రోజుకు గరిష్టంగా 2 టేబుల్ స్పూన్లు (30 ఎంఎల్) మించ కూడదు. దీనికి అలర్జీలు సాధారణంగా రావు. ఒకవేళ వస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement