అనంత్‌ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్‌ : అనంత్‌ లవ్‌ లెటర్‌ను గమనించారా? Anant Ambani Radhika prewedding sculpted in Gold and love letter | Sakshi
Sakshi News home page

అనంత్‌ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్‌ : అనంత్‌ లవ్‌ లెటర్‌ను గమనించారా?

Published Mon, Jun 17 2024 1:44 PM

 Anant Ambani Radhika prewedding sculpted in Gold and love letter

బంగారు పూతతో చేసిన ​‘కోచర్‌’

అనంత్‌ రాసిన లవ్‌లెటర్‌

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదు.  ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల  చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్‌మర్చంట్‌, శైలా విరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ ముందస్తు పెళ్లి వేడుకలే ఇందుకు నిదర్శనం. అనంత్‌-రాధిక నిశ్చితార్థం  వేడుక మొదలు ఇటీవల, ఇటలీలో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుకల దాకా ప్రతీదీ  అత్యంత ఘనంగా నిర్వహించారు. 

లగ్జరీ క్రూయిజ్‌లో 800మందికి పైగా అతిథులతో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు సంబంధించిన విశేషాలు రోజుకొకటి నెట్టింట విశేషంగా మారు తున్నాయి. ముఖ్యంగా కాబోయే వధువు రాధిక మర్చంట్‌ దుస్తులు, నగలతో పాటు, అత్తగారి హోదాలో నీతా అంబానీ లుక్‌, ఖరీదైన నగలు చర్చనీయాంశంగా నిలిచాయి. తాజాగా సినీ నిర్మాత రియా కపూర్ రాధిక మర్చంట్‌ దుస్తులకు సంబంధించిన ప్రత్యేకతలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. రాధిక ధరించిన గౌనుపై అనంత్‌ లవ్‌ లెటర్‌ను అందంగా పొందుపరచడం విశేషం.


  
అలాగే బంగారు పూతతో తయారు చేసిన మరో అద్భుతమైన డ్రెస్‌ వివరాలను కూడా రియా అందించారు. అంబానీ రాయల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా టోగా పార్టీలో రాధిక ధరించిన గ్రేస్ లింగ్ ‘​కోచర్‌’ని  గురించి పరిచయం చేశారు.  

రాధిక బాడీకి అతికినట్టు సరిపోయింది అంటూ  దీన్ని తయారు చేసిన టీంకు అభినందనలు తెలిపారు. అత్యాధునిక 3డీ టెక్నాలజీతో 30 మంది కళాకారులు దీన్ని తయారు చేశారట. 
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement