చిత్తూరు: ఏనుగు బీభత్సం.. భార్యభర్తల మృతి | Two Persons Died In Elephant Attack In Andhra Pradesh Chittoor District, Details Inside - Sakshi
Sakshi News home page

Elephant Attack In Chittoor: చిత్తూరులో ఒంటరి ఏనుగు బీభత్సం.. భార్యభర్తల మృతి

Published Wed, Aug 30 2023 12:22 PM | Last Updated on Wed, Aug 30 2023 12:55 PM

Two Died In Elephant Attack In Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు జిల్లా: గుడిపాల మండలం ‘190 రామాపురం’లో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడి చేయడంతో ఇద్దరు మృతిచెందారు. మృతులను రామాపురం హరిజనవాడకు చెందిన దంపతులు వెంకటేష్‌, సెల్వీగా గుర్తించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యభర్తలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పంలో సమీపంలో కూడా అడవి ఏనుగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో ‘కంత్రీ’ బాబా.. నవ వధువు కళ్లకు గంతలు కట్టి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement