ఒడిశా ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్‌ | CBI Arrest 3 For Odisha Train Tragedy Full Details | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురి వల్లే.. కోరమాండల్‌ దుర్ఘటన కేసులో ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్‌

Published Fri, Jul 7 2023 6:23 PM | Last Updated on Fri, Jul 7 2023 6:33 PM

CBI Arrest 3 For Odisha Train Tragedy Full Details - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా బాలాసోర్‌ రైలు ప్రమాదానికి సంబంధించి.. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. జూన్‌ 2వ తేదీ రాత్రిపూట జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో 290 మంది దాకా మృతి చెందిన సంగతి తెలిసిందే. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.

అయితే ఈ దుర్ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. పలువురిని విచారించింది. ఘటనకు కారకులు అవ్వడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు అనే అభియోగాల మీదే వీళ్లను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ మగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. 

అరెస్ట్ అయిన వాళ్లు అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్ , పప్పు కుమార్‌గా తెలుస్తోంది. వీళ్లపై హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య కింద, అలాగే.. సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపింది సీబీఐ. ఈ ముగ్గురి చర్యలు.. ప్రమాదానికి దారితీశాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. తాము చేసిన పని పెనుప్రమాదానికి.. విషాదానికి దారి తీస్తుందనే అవగాహన వాళ్లకు ఉందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది.

ఇదీ చదవండి: ఒడిశా దుర్ఘటన.. అమీర్‌ ఖాన్‌ ఇంటికి సీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement