ఇల్లెందులో వీగిన అవిశ్వాసం a case of kidnapping has been registered against congress mla koram kanakaiah | Sakshi
Sakshi News home page

ఇల్లెందులో వీగిన అవిశ్వాసం

Published Tue, Feb 6 2024 1:52 AM | Last Updated on Tue, Feb 6 2024 1:52 AM

a case of kidnapping has been registered against congress mla koram kanakaiah - Sakshi

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై కొందరు కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం వీగిపోయింది. సమావేశానికి త గిన కోరం లేనందున అవిశ్వాసం వీగిపోయినట్టుగా ఎన్నిక ల అధికారిగా వ్యవహరించిన కొత్తగూడెం ఆర్డీఓ శిరీష ప్రక టించారు. కౌన్సిలర్ల అవిశ్వాసం నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలో ఈవో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 24 మంది కౌన్సి లర్లకు గాను కోరం సరిపోవాలంటే 17 మంది హాజరు కావా ల్సి ఉంది.

అయితే సమావేశ సమయానికి ఇద్దరు తక్కువగా 15 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో కొంత సమయం ఇస్తూ సమావేశం వాయిదా వేశారు. తర్వాత 12 గంటలకు మరోమారు సమావేశపర్చగా అప్పటికీ 15 మంది మాత్రమే ఉండడంతో కోరం లేదని ఈవో ప్రకటించారు.17 మంది రాత్రికే చేరుకున్నా..: అవిశ్వాస పరీక్ష నేపథ్యంలో మున్సిపల్‌ కార్యాలయం పక్కనే ఉన్న పెన్షనర్‌ భవన్‌ లోకి ఆదివారం రాత్రికే 17 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో వారంతా మున్సిపల్‌ కార్యాలయంలోకి పరుగులు తీశారు.

అయితే మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వేచి ఉన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ వారిని గమనించారు. కొక్కు నాగేశ్వరరావు అనే కౌన్సిలర్‌ను కాంగ్రెస్‌ శ్రేణులు ఎత్తుకుని ఎదురుగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లి, వెనుక నుంచి రోడ్డుపైకి తీసుకెళ్లి అప్పటికే సిద్ధంగా ఉంచిన ఓ కారులో హైదరాబాద్‌కు తరలించారు. ఇదే క్రమంలో పెన్షనర్‌ భవన్‌లో దాక్కుని ఉన్న సీపీఐ కౌన్సిలర్‌ కుమ్మరి రవీందర్‌ బయటకు రాగానే కాంగ్రెస్, దాని మిత్రపక్ష సీపీఐ శ్రేణులు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకుని విడిపించారు.

అయితే అప్పటికే మున్సిపాలిటీలో తమ సభ్యుడి కోసం కాచుకుని కూర్చున్న సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా రవీందర్‌తో మాట్లాడటంతో ఆయన కార్యాలయం వెనుక గోడ దూకి పారిపోయారు. ఇలా ఇద్దరు సభ్యులు తక్కువ కావడంతో కోరం చాలక అవిశ్వాసం వీగిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులతో బీఆర్‌ఎస్‌ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరులు వాగ్వాదానికి దిగారు. గంట పాటు కార్యాలయం ఎదుట ఆందోళన  చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, చైర్మన్‌ వెంకటేశ్వరావుపై ఫిర్యాదు చేశారు. 

కోరం కనకయ్యపై కేసు నమోదు
తన భర్తను కిడ్నాప్‌ చేశారంటూ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కొక్కు నాగేశ్వరరావు సతీమణి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు 17 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్‌ తెలిపారు. ఎంపీపీ నాగరత్నమ్మ, ఆమె భర్త జానీ తదితరులపై కేసు నమోదైందని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement