అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసు.. ఐదుగురికి బెయిల్‌ | Bail Granted For Amit Sha Morphing Video Accused Congress Workers | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసు.. ఐదుగురికి కండిషనల్‌ బెయిల్‌

Published Fri, May 3 2024 3:05 PM | Last Updated on Fri, May 3 2024 3:18 PM

Bail Granted For Amit Sha Morphing Video Accused Congress Workers

సాక్షి,హైదరాబాద్‌: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మార్ఫింగ్‌ వీడియో పోస్ట్‌ చేసి అరెస్టయిన ఐదుగురు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలకు కోర్టు కండిషనల్‌ బెయిల్‌​ ఇచ్చింది.

పది వేల పూచీకత్తుతో కూడిన రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిందితులు ప్రతీ సోమ, శుక్ర వారాలు కేసు విచారణ అధికారుల ముందు హాజరు కావాలని కోరింది. 

కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధులు  ఐదుగురు వాట్సాప్‌లో వచ్చిన అమిత్‌ షా మార్ఫింగ్‌ వీడియోలను కావాలనే ట్విటర్‌లో పోస్టు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలన్న ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు పోస్టు చేసినట్లు ప్రాథమికంగా తేలినందున ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement