ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్‌లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి X, YouTube, Telegram get MeitY notices over child sex abuse | Sakshi
Sakshi News home page

ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్‌లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి

Published Sat, Oct 7 2023 5:24 PM | Last Updated on Sat, Oct 7 2023 5:35 PM

X YouTube Telegram get MeitY notices over child sex abuse - Sakshi

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. నోటీసులు అందించడానికి కారణమేంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం,  చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (చిన్న పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించినవి) ప్లాట్‌ఫామ్స్ నుంచి వెంటనే తీసివేయాలని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఆయా ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో కంటెంట్ మోడరేషన్ అల్గారిథమ్‌లు, రిపోర్టింగ్ మెకానిజమ్స్ వంటి చురుకైన చర్యలను కూడా అమలు చేయాలని తెలిపింది.

ఈ నియణామాన్ని పాటించకుంటే 2021 రూల్ 3(1)(బి) అండ్ రూల్ 4(4) ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ప్రకటనలో తెలిపింది. దీనిని ఉల్లంఘిస్తే.. సెక్షన్ 79 ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

ఇదీ చదవండి: అంబానీ కంపెనీతో ఏడీఏఐ డీల్.. వేలకోట్లు పెట్టుబడికి సిద్ధం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement