‘ఎక్స్‌’లో పోస్టులు మాయం.. యూజర్ల గగ్గోలు! | Social Media Platform X (Twitter) Suffers Global Outage, See Details - Sakshi
Sakshi News home page

X Twitter Down Today: ‘ఎక్స్‌’లో పోస్టులు మాయం.. యూజర్ల గగ్గోలు!

Published Thu, Dec 21 2023 2:09 PM | Last Updated on Thu, Dec 21 2023 3:22 PM

X twitter was down - Sakshi

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ఎక్స్ (ట్విటర్) సేవల్లో తరచూ అంతరాయం కలుగుతోంది. ఇటీవల మొరాయించిన ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం రోజుల వ్యవధిలో మళ్లీ స్తంభించడంతో యూజర్ల గగ్గోలు పెడుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గురువారం ఉదయం 11 గంటల తర్వాత ‘ఎక్స్‌’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అకౌంట్‌ను యాక్సెస్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ఏం జరిగిందో తెలియక లక్షలాదిమంది యూజర్లు గందరగోళానికి గురయ్యారు. వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఓపెన్ అవుతున్నా.. అసంపూర్తిగా ఉండడంతోపాటు పోస్టలు చేసేందుకు వీలు లేకుండా పోయింది.

తమ పోస్టులు కూడా కనిపించకుండా పోయాయని కొందరు యూజర్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. తమకు ఎక్స్ అకౌంట్‌ యాక్సెస్ లభించలేదంటూ 67 వేల మందికిపైగా ఫిర్యాదు చేశారు. ఇండియన్ వెర్షన్ వెబ్‌సైట్స్‌కు ఇలాంటి ఫిర్యాదులు 4,800 వచ్చాయి. అయితే సేవల్లో అంతరాయంపై ఎక్స్ ఎలాంటి స్పందనా రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement