Sexual Harassment Of Women At Work From Home In India - Sakshi
Sakshi News home page

Work From Home: ఆగని లైంగిక వేధింపులు! ఎలా ‘టార్గెట్‌’ చేస్తున్నారంటే..

Published Mon, Sep 6 2021 1:15 PM | Last Updated on Mon, Sep 6 2021 1:44 PM

Work From Home Sexual Harassment Not Stopped In India - Sakshi

Work From Home Sexual Harassment: పనిచేసే చోట లైంగిక వేధింపులు.. చర్చల్లో నడిచే ఒక ప్రధాన అంశం. అయితే కరోనా కారణంగా ఈ ఫిర్యాదులు బాగా తగ్గాయి. అది ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ కారణంగానే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రిమోట్‌ వర్క్‌ స్పేస్‌లోనూ లైంగిక వేధింపులు ఆగట్లేదని ఎంప్లాయిస్‌ వాపోతున్నారు. యాంటీ-సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ అడ్వైజరీ ‘కంప్లైకరో డాట్‌ కామ్‌’ ఈ ఏడాదికి నిర్వహించిన సర్వేలో.. వార్షిక నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది.


భారత్‌లో ఉన్న టాప్‌ 44 కంపెనీలలో వర్క్‌ ఫ్రమ్‌ హోంలో ఉన్న ఎంప్లాయిస్‌ నుంచి లైంగిక వేధింపులపై ఫిర్యాదులు సేకరించింది కంప్లైకరో డాట్‌ కామ్‌. కిందటి ఏడాదితో పోలిస్తే తక్కువ ఫిర్యాదులు(రెండొందలకు పైగా తక్కువ) రాగా..  లైంగిక వేధింపుల కేసుల శాతం 38.26 శాతానికి పడిపోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇది గత రెండేళ్లతో పోలిస్తే చాలా తక్కువ. అయితే రిమోట్‌ వర్క్‌లోనూ ఎంప్లాయిస్‌ తాము ఎదుర్కొంటున్న వేధింపులను చర్చకు తీసుకురావడం విశేషం.
 

సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎట్‌ వర్క్‌ప్లేస్‌ యాక్ట్‌ 2013 ప్రకారం.. ప్రతీ ఏడాది లిస్టెడ్‌ కంపెనీలు తప్పనిసరిగా లైంగిక వేధింపుల ఫిర్యాదుల్ని నమోదు చేయడం, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వాలకు నివేదికల్ని సమర్పించాల్సిందే. 


వేళకానీ వేళలో..
సర్వేలోనే సుమారు ఐదు వందల దాకా ఫిర్యాదు అందాయి. ఇవిగాక కొందరు సర్వే పోర్టల్‌కు పర్సనల్‌ మేసేజ్‌ల ద్వారా, మరికొందరు సోషల్‌ మీడియా ద్వారా తమ అభద్రత భావాన్ని వ్యక్తపరిచారు. ఈ క్రమంలో కొలీగ్స్‌, టీమ్‌ మేట్స్‌, టీమ్‌ లీడ్స్‌తో పాటు మేనేజర్‌, బాస్‌ స్థాయి వ్యక్తులపై సైతం ఫిర్యాదులు రావడం విశేషం. విపరీతమైన వర్క్‌ టాస్క్‌లు ఇస్తున్నారని, అవి తప్పించాలంటే తమతో సన్నిహితంగా ఉండాలంటూ ఒత్తిడి చేస్తున్నారని కొందరు వాపోయారు. ఇంకొందరు వేళకానీ వేళలో ఆన్‌లైన్‌కి, వీడియో కాల్స్‌కి రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, ‘అనవసరమైన-వ్యక్తిగత’ చర్చలతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఇదంతా తమ మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపెడుతోందని వాపోయారు వాళ్లు. దీంతో నాలుగు గోడల మధ్య వర్చువల్‌గా జరుగుతున్న వేధింపుల వ్యవహారం ఇప్పుడు చర్చకు దారితీసింది.

 

టార్గెట్‌ ఎంప్లాయిస్‌
కరోనా కారణంగా.. వర్క్‌ ఫ్రమ్‌ హోంకి ఎంప్లాయిస్‌కు అనుమతిస్తున్న కంపెనీల్లో చాలావరకు హైక్‌ల సంగతి పక్కనపెట్టి, ఉద్యోగాల విషయంలో అభద్రతా భావాన్ని క్రియేట్‌ చేసి ఎంప్లాయిస్‌తో పని చేయించుకుంటున్నాయి. టార్గెట్‌లను ఫినిష్‌ చేయడానికి సాధారణ పని గంటల కంటే అదనంగా (మరో నాలుగైదు గంటలు) పని చేయాల్సి వస్తోందని చాలామంది వాపోతున్నారు కూడా. అయినప్పటికీ వైరస్‌ భయం, ఇతరత్ర కారణాలతో వర్క్‌ ఫ్రమ్‌ హోంకే మొగ్గు చూపిస్తున్నారు. ఈ తరుణంలో ఆఫీస్‌ స్పేస్‌లలో వేధింపులు తగ్గినప్పటికీ.. వర్క్‌ఫ్రమ్‌ హోంలోనూ వర్చువల్‌ మీటింగ్‌ల పేరుతో కొందరు ఉద్యోగిణులు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల్ని ఈ సర్వేలో ప్రస్తావనకు తెచ్చారు.

చదవండి: వర్క్‌ఫ్రమ్‌ హోం.. కంపెనీల అనూహ్య నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement