Woman's tweet about charges in food delivery bill; Zomato clarifies - Sakshi
Sakshi News home page

Zomato: ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా..

Published Tue, Aug 8 2023 12:38 PM | Last Updated on Tue, Aug 8 2023 1:22 PM

Woman tweet about charges in food delivery zomato reply - Sakshi

టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తరుణంలో ఏమి కావాలన్నా.. ఇంట్లో కూర్చుని పొందగలుగుతున్నారు. కేవలం వస్తువులు మాత్రమే కాకుండా, ఫుడ్ కూడా ఉన్న చోటికే ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు బిల్లు చూస్తే చుక్కలు కనిపిస్తాయి. ఇలాంటి సంఘటనే తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, అహ్మదాబాద్‌కి చెందిన ఒక మహిళ జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆమెకు వచ్చిన బిల్ చూసి ఒక్క సారిగా అవాక్కయింది. ఎందుకంటే బిల్లులో కంటైనర్ చార్జీలు కూడా కలిపి ఉన్నారు. ఆమె మూడు ప్లేట్స్ 'దూది తెప్లా' (Dudhi Thepla) ఆర్డర్ చేసింది. ఒక ప్లేట్ ధర రూ. 60 కావడంతో మొత్తం బిల్లు రూ. 180 అయింది. కానీ ఇందులో కంటైనర్ చార్జీలు కూడా కలిపి రూ. 249గా నివేదించారు.

బిల్ అందుకున్న మహిళ, దానిని స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ (ట్విటర్) ద్వారా షేర్ చేసింది. ఆర్డర్ చేసిన ఆహారానికి కంటైనర్ చార్జీలు కూడా వసూలు చేస్తారా అంటూ వాపోయింది. దీనికి స్పందించిన కంపెనీ కంటైనర్ చార్జీలు రెస్టారెంట్లు విధిస్తాయని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఆర్డర్ చేసిన ఆహారానికి 5 నుంచి 18 శాతం వరకు చార్జీలు రెస్టారెంట్లు విధిస్తాయని తెలిపింది.

ఇదీ చదవండి: భయపడుతున్న ఫోన్‌పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే..

సోషల్ మీడియాలో వెల్లడైన ఈ పోస్ట్ మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అదనపు చార్జీలు చిరాకును తెప్పిస్తాయని, మరికొందరు బిల్లు ముందుగానే చూసుకోవాలి కదా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి అదనపు ఛార్జీలకు సంబంధించిన సంఘటనలు గతంలో కూడా చాలా వెల్లడయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement