Whatsapp Introduces Feature To Access Same Account On Multiple Phones - Sakshi
Sakshi News home page

వినతుల వెల్లువ.. వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌!

Published Wed, Apr 26 2023 7:20 AM | Last Updated on Wed, Apr 26 2023 10:19 AM

Whatsapp Introduces Feature To Access Same Account On Multiple Phones  - Sakshi

న్యూఢిల్లీ: వాట్సాప్‌ ఓ అనుకూల సదుపాయాన్ని తన యూజర్ల కోసం రూపొందించింది. ఒకటికి మించిన ఫోన్లలో ఒక్కటే వాట్సాప్‌ ఖాతాను ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. అంతర్జాతీయంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు, రానున్న వారాల్లో ప్రతి ఒక్కరికీ ఇది వినియోగంలోకి వస్తుందని పేర్కొంది.

ఈ ఫీచర్‌ కావాలంటూ వాట్సాప్‌ యూజర్లలో ఎక్కువ మంది నుంచి వినతులు రావడంతో దీన్ని రూపొందించినట్టు సంస్థ తెలపింది. వాట్సాప్‌ను వెబ్‌ బ్రౌజర్‌కు కనెక్ట్‌ చేసిన మాదిరే, ఒకటికి మించిన ఫోన్లలోనూ అనుసంధానించడం ద్వారా కొత్త ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒకే ఖాతా అనుసంధానమై ఉన్న ఏ ఫోన్లో అయినా చాట్, మీడియా, కాల్స్‌ సేవలు వాడుకోవచ్చని వాట్సాప్‌ తెలిపింది.

ఒకవేళ ప్రైమరీ ఫోన్‌ (మొదట ఇన్‌స్టాల్‌ చేసుకున్న)లో వాట్సాప్‌ చాలా కాలంగా యాక్టివ్‌గా లేకపోతే, అప్పుడు ఆ అకౌంట్‌ కనెక్ట్‌ అయి ఉన్న ఇతర ఫోన్లలోనూ దానంతట అదే లాగవుట్‌ అవుతుందని పేర్కొంది. సైనవుట్‌ చేయాల్సిన అవసరం లేకుండా, ఒక ఫోన్‌ నుంచి ఇంకో ఫోన్‌కు ‘నౌ స్విచ్‌’ను ఎంపిక చేసుకోవచ్చని వాట్సాప్‌ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement