Do You Know Starbucks Next CEO Laxman Narasimhan Take Home Salary, Details Inside - Sakshi
Sakshi News home page

Starbucks Next CEO Salary: స్టార్‌బక్స్ సీఈవో లక్ష్మణ్ నరసింహన్ జీతం ఎంతంటే?

Published Sat, Sep 3 2022 12:13 PM | Last Updated on Sat, Sep 3 2022 12:39 PM

What Will Be Starbucks Next CEO Laxman Narasimhan salary amazing details - Sakshi

సాక్షి,ముంబై:  గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ కొత్త సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. దీనిపై ఆనంద్ మహీంద్రా లాంటి పలువురు వ్యాపార దిగ్గజాలు భారతీయ బిజినెస్‌ లీడర్స్‌ సురక్షితమైన, ప్రతిభావంతమైన  వారుగా పాపులర్‌ అతున్నారని  వ్యాఖ్యానించారు.

ఇది చదవండి : Laxman Narasimhan:స్టార్‌బక్స్‌ సీఈవో ఇన్‌స్పైరింగ్‌ జర్నీ..ఫిదా అవ్వాల్సిందే!

2023 ఏప్రిల్‌ నుంచి సీఈవోగా పూర్తి బాధ్యతలను స్వీకరించనున్న లక్ష్మణ్ నరసింహన్‌ వార్షిక మూల వేతనంగా 1.3 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 10 కోట్లు) తీసుకుంటారని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్టార్‌బక్స్‌ పేర్కొంది.  అలాగే సుమారు 12 కోట్ల రూపాయల బోనస్‌తో పాటు 9.25 మిలియన్‌  డాలర్ల (సుమారు రూ. 73 కోట్లు)  విలువైన ఈక్విటీ గ్రాంట్‌ను కూడా అందుకుంటారు. 2023 ఆర్థిక సంవత్సరం నుండి, 13.6 మిలియన్‌ డాలర్లకు (రూ. 107 కోట్లకు పైగా) సమానమైన వార్షిక ఈక్విటీ అవార్డును పొందనున్నారు.

కాఫీతో మనం కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చివేసిన సాటిలేని మేటి కంపెనీ ఎదిగిన స్టార్‌బక్స్‌లో చేరడం సంతోసంగా ఉందని నరసింహన్‌ ప్రకటించారు. నిబద్ధతతో సేవలందిస్తూ ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకునే బ్రాండ్‌ స్టార్‌బక్స్‌ అని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఎదుర్కొంటున్న, మారుతున్న, డిమాండ్స్‌ తీర్చడానికి మరింత బలమైన భవిష్యత్తు పెట్టుబడులు పెడుతున్న  కీలక సమయంలో దిగ్గజ కంపెనీ స్టార్‌బక్స్‌లో చేరడం గౌరవంగా భావిస్తానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement