పసిడి ప్రియులకు శుభవార్త!.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు | Today Gold and Silver Price [June 3, 2024] | Sakshi
Sakshi News home page

పసిడి ప్రియులకు శుభవార్త!.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు

Published Mon, Jun 3 2024 11:00 AM | Last Updated on Mon, Jun 3 2024 11:09 AM

Today Gold and Silver Price [June 3, 2024]

జూన్ 1 నుంచి తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. ఈ రోజు (జూన్ 3) కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కాబట్టి నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66100 (22 క్యారెట్స్), రూ.72110 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గాయి.

చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 440 నుంచి రూ. 480 వరకు తగ్గాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66660 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72720 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు కొంత తగ్గినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66250 (10 గ్రా), 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72260 (10 గ్రా) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గినట్లు తెలుస్తోంది.

వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా గత నాలుగు రోజుల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఒక కేజీ వెండి ధర రూ. 700 తగ్గింది. కాబట్టి రూ. 93500 వద్ద ఉన్న వెండి రూ. 92800లకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement