భారత్‌కు థామ్సన్‌ ల్యాప్‌టాప్స్‌ | Thomson Enter Domestic Laptop Segment | Sakshi
Sakshi News home page

భారత్‌కు థామ్సన్‌ ల్యాప్‌టాప్స్‌

Published Thu, Oct 12 2023 6:09 AM | Last Updated on Thu, Oct 12 2023 6:09 AM

Thomson Enter Domestic Laptop Segment - Sakshi

న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్‌ తయారీలో ఉన్న థామ్సన్‌.. భారత ల్యాప్‌టాప్స్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రారంభ, మధ్య, ప్రీమియం విభాగాల్లో 2024 మార్చి నాటికి ల్యాప్‌టాప్స్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం యూఎస్, ఫ్రాన్స్, యూరప్‌లో వీటిని విక్రయిస్తోంది. అలాగే భారత్‌లో తయారైన స్మార్ట్‌ టీవీలు, ఇతర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ నిర్ణయించింది.

భారత్‌లో థామ్సన్‌ బ్రాండ్‌ లైసెన్స్‌ కలిగిన సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ రూ.300 కోట్లతో అత్యాధునిక ప్లాంటును ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్‌ వద్ద స్థాపిస్తోంది. ప్లాంటు అందుబాటులోకి వస్తే టీవీల తయారీలో సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ వార్షిక సామర్థ్యం 20 లక్షల యూనిట్లకు చేరుతుంది. 15 ఏళ్ల విరామం తర్వాత 2018లో సూపర్‌ ప్లా్రస్టానిక్స్‌ భాగస్వామ్యంతో థామ్సన్‌ భారత్‌లో రీఎంట్రీ ఇచి్చంది. స్మార్ట్‌ టీవీలతోపాటు వాషింగ్‌ మెషీన్స్, ఎయిర్‌ కండీషనర్స్, చిన్న ఉపకరణాలను భారత్‌లో విక్రయిస్తోంది.  

టాప్‌–5లో భారత్‌..
అంతర్జాతీయంగా భారత్‌ను టాప్‌–5లో నిలబెట్టాలని లక్ష్యంగా చేసుకున్నట్టు థామ్సన్‌ను ప్రమోట్‌ చేస్తున్న యూఎస్‌కు చెందిన ఎస్టాబ్లి‹Ù్డ ఇంక్‌ సేల్స్‌ డైరెక్టర్‌ సెబాస్టియన్‌ క్రాంబెజ్‌ తెలిపారు. ‘భారత్‌లో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని యూరప్‌లోని భాగస్వాములను ప్రోత్సహిస్తాం. వారు డబ్బులు ఆదా చేయడంతోపాటు ఇక్కడి ఉత్పత్తులు పోటీ ధరలో లభిస్తాయి.

నాణ్యత కూడా బాగుంది. వారు భారత్‌ నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇటువంటి అవకాశాలు టీవీలకు మాత్రమే పరిమితం కాదు. ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్స్‌కు కూడా విస్తరించే అవకాశం ఉంది’ అని వివరించారు. సూపర్‌ ప్లా్రస్టానిక్స్‌కు భారత్‌లో కొడాక్, బ్లాపంక్ట్, వైట్‌ వెస్టింగ్‌హౌజ్‌ టీవీ, వైట్‌ వెస్టింగ్‌హౌజ్‌ (ఎలక్ట్రోలక్స్‌) బ్రాండ్ల హక్కులు సైతం ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement