ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం Tesla Strategic Deal With Tata Electronics To Acquire Semiconductor Chip | Sakshi
Sakshi News home page

సెమీకండక్టర్ల సరఫరాకు టాటా గ్రూప్‌తో టెస్లా డీల్‌

Published Mon, Apr 15 2024 11:55 AM | Last Updated on Mon, Apr 15 2024 12:40 PM

Tesla Strategic Deal With Tata Electronics To Acquire Semiconductor Chip - Sakshi

టెస్లా తన కార్యకలాపాల కోసం సెమీకండక్టర్ చిప్‌లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్‌తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈమేరకు కొన్ని వార్తామీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. 

కొన్నినెలల కొందట టాటా గ్రూప్‌ సెమీ కండక్టర్‌ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు రూ.40వేల కోట్ల పెట్టుబడితో అస్సాంలో సెమీకండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

సెమీకండక్టర్‌ తయారీ నేపథ్యంలో టాటాగ్రూప్‌ గ్లోబల్‌ క్లయింట్‌లను సంపాదించే పనిలో పడింది. అందులో భాగంగా టెస్లాతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే టెస్లా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేసింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఈవీపాలసీ నిబంధనలతో దాదాపు ఆ సంస్థ భారత్‌ ప్రవేశానికి లైన్‌ క్లియరైంది. ఈ తరుణంలో ఇండియాలో తమ తయారీ ప్లాంట్‌ పెట్టేందుకు టెస్లా సిద్ధపడుతోందని తెలిసింది. ఈనెల 21న ఎలొన్‌మస్క్‌ ఇండియా రానున్నారు. ఈమేరకు దానిపై కీలక నిర్ణయం వెలువడనుందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఇదీ చదవండి: ‘తప్పు చేశాం.. మళ్లీ తప్పు చేస్తాం..’ 10వేల డాలర్లు ఆఫర్‌..

ఈ పరిణామాల నేపథ్యంలో టాటాగ్రూప్‌ టెస్లాతో సెమీకండక్టర్ల విషయంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇరు కంపెనీల మధ్య ఎంత విలువ చేసే డీల్‌ కుదిరిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మస్క్‌ భారత్‌ పర్యటనలో భాగంగా దాదాపు 2-3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అమెరికన్‌ ఈవీ దిగ్గజ సంస్థ దేశంలో తమ ఉత్పత్తుల తయారీకోసం రిలయన్స్‌తో జాయింట్ వెంచర్‌ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement